టీ తో పాటు ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.. తిన్నారంటే మాత్రం..!

పరిగడుపున టి అసలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఇది గ్యాస్, ఎసిడిటీ ( Acidity )వంటి సమస్యలను కలిగిస్తుంది.

అయితే టీతో బిస్కెట్లు, బ్రెడ్ ను తినే అలవాటు చాలామందికి ఉంటుంది.కానీ టీ తో పాటు కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు.

ఎందుకంటే ఇవి ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి.మనమందరం టీతోపాటు ఏదో ఒకటి తింటూ ఉంటాము.

చాలామంది స్నాక్స్ లేకుండా టీ ని అసలు తాగరు.కానీ టీతో ఏది పడితే అది తినకూడదు.

ఎందుకంటే ఇది మన జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది.అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తుంది.

"""/" / అసలు టీతో పాటు వీటిని తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పసుపు ఎక్కువగా ఉండే ఆహారాలను మర్చిపోయి కూడా టీతోపాటు తినకూడదు.

లేదంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను( Digestive Problems ) ఎదుర్కోవాల్సి వస్తుంది.

పసుపు, టీ ఆకులు రెండు ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉంటాయి.కాబట్టి ఈ రెండిటిని కలపడం ఆరోగ్యంపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే నిమ్మరసం ఉన్న ఆహారాన్ని టీ తాగిన వెంటనే తీసుకోకూడదు. """/" / ఎందుకంటే టీ ఆకులు నిమ్మరసం( Lemon Juice ) ఒకదానికొకటి కలిసి టీ ఆమ్లంగా మారుతుంది.

ఇది యాసిడ్ రిఫ్లెక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే టీతో పాటు బిస్కెట్లను తినే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది.

ఈ కాంబినేషన్ చాలామందికి రెగ్యులర్ డైట్ లో భాగం అవుతుంది.పిండి పంచదారతో బిస్కెట్లను తయారు చేస్తారు.

అయితే టీలో అదనపు పంచదార బిస్కెట్ లోని మైదా జీర్ణ సంబంధిత సమస్యలను వచ్చేలా చేస్తుంది.

ఇవి ఎసిడిటీ మలబద్దకం ప్రమాదాన్ని పెంచుతుంది.ఇంకా చెప్పాలంటే టీ తో పాటు పకోడీలను తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.

ఇలా తింటే ఎంతో రుచిగా కూడా అనిపిస్తుంది.కానీ ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఎందుకంటే వేయించిన ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న జో బైడెన్