ఇలా మాత్రం అస్సలు చేయకూడదు.. చేస్తే డబ్బంతా మంచి నీళ్లలా ఖర్చు..!

ప్రతి ఒక్కరి జీవితంలో సంపద, ఆరోగ్యం అత్యంత కీలకమైనవి అని కచ్చితంగా చెప్పవచ్చు.

జీవితంలో సంతోషంగా, ఆనందంగా జీవించడానికి సరిపడా డబ్బు( Money ) కచ్చితంగా ఉండాలి.

అలాగే ఆరోగ్యం లేకపోతే ఏదీ ఉన్నా కూడా ఏ ఉపయోగముండదు.అందుకే ప్రతి మనిషి జీవితంలో ఆరోగ్యం, సంపద ఎంతో ముఖ్యమైనవి అని పెద్దవారు చెబుతూ ఉంటారు.

ఆరోగ్యం కాపాడుకోవడానికి చాలా చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.సరైన ఆహారం తినడం, వ్యాయామం చేయడం,చెడు అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

అలాగే తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. """/" / వాస్తు శాస్త్రం( Vastu Shastra ) ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల సంపదకు అధిపతి అయిన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.

వాస్తు ప్రకారం ఎలాంటి అలవాట్లు ఒకరి ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయో, ఒక వ్యక్తిని పేదవాడిని చేస్తాయో వాటిని ఎలా జరగకుండా చూసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి.వాస్తు ప్రకారం సూర్యోదయానికి తర్వాత నిద్ర లేవకూడదు.

తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.ఇంకా చెప్పాలంటే మనిషి మనుగడకు నీరు ఎంతో అవసరం.

నీటిని వీలైనంతవరకు ఆద చేసేందుకు ప్రయత్నించాలి.శాస్త్రాల ప్రకారం నీటి వృధా పాపం కిందే లెక్క.

"""/" / కుళాయి నుంచి నీరు లీక్ అవుతూ ఉంటే వీలైనంత వరకు త్వరగా రిపేర్ చేయించాలి.

ఇంకా చెప్పాలంటే సంపాద, శ్రేయస్సు అధిపతి అయిన లక్ష్మీదేవి శుభ్రమైన ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడుతుంది.

స్వచ్ఛమైన ఎప్పుడూ క్లీన్ గా ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి( Goddess Lakshmi ) కొలువు తీరుతుంది.

అందుకే ఇంటిని అపరిశుభ్రంగా ఉంచకూడదు.ఇంకా చెప్పాలంటే గురువారం రోజు గోళ్లు జుట్టు అస్సలు కత్తిరించకూడదు.

సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, డబ్బును ఇంటి నుంచి బయటకు వెళ్ళనీయకూడదు.

రాజమౌళి తర్వాత వరుస సక్సెస్ లను అందుకుంటున్న దర్శకుడు ఎవరో తెలుసా..?