జంక్ ఫుడ్‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉండాలంటే ఇవి తినాల్సిందే!

ఇటీవ‌ల రోజుల్లో పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా కోట్లాది మంది జంక్ ఫుడ్ కు బానిస‌లుగా మారుతున్నారు.

జంక్ ఫుడ్ ను రెగ్యుల‌ర్‌గా లొట్ట‌లేసుకుని తినే అలవాటు ఎంద‌రికో ఉంటుంది.జంక్ ఫుడ్ తినేందుకు రుచిగా ఉంటుంది.

కానీ, పోష‌కాలు ఏమీ ఉండ‌వు.పైగా వాటి త‌యారీలో వాడే రా మెటీరియల్ వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెడ‌తాయి.

జంక్ ఫుడ్ ను అధికంగా తీసుకునే వారు గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, ర‌క్త‌పోటు, ఆస్థమా, ఆల్జీమ‌ర్స్‌, ఊబ‌కాయం వంటి వ్యాధుల బారిన ప‌డే అవ‌కాశాలు అంత‌కంత‌కు పెరుగుతాయి.

అందుకే జంక్ ఫుడ్‌తో జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నిపుణులు చెబుతుంటారు.కానీ, ఎవ‌రెన్ని చెప్పినా ఒక్క‌సారి జంక్ ఫుడ్ కు అల‌వాటు ప‌డ్డారంటే.

దాని నుంచి బ‌య‌ట ప‌డ‌లేక‌పోతుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.

? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే జంక్ ఫుడ్‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

అస‌లు జంక్ ఫుడ్ జోలికే వెళ్ల‌కుండా ఉంటారు.మ‌రి ఇంకెందుకు లేటు ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

సిట్ర‌స్ పండ్లు.ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

ముఖ్యంగా జంక్ ఫుడ్‌ను తినాల‌ని కోరిక క‌లిగిన వెంట‌నే నారింజ‌, ద్రాక్ష‌, బొప్పాయి, క‌మ‌లా వంటి సిట్ర‌స్ పండ్ల‌ను తీసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల జంక్ ఫుడ్ తినాలి అనే కోరిక చ‌చ్చిపోతుంది. """/"/ అలాగే జంక్ ఫుడ్ పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉండాలంటే డైట్‌లో వాల్‌న‌ట్స్ ఉండేలా చూసుకోవాలి.

వీటిలో ఉండే ప‌లు పోష‌కాలు అతి ఆక‌లి స‌మ‌స్యను త‌గ్గించ‌డంతో పాటు జంక్ ఫుడ్ తినాలి అనే కోరిక‌ను నివారిస్తుంది.

ఉడికించిన శనగలు రుచిగా ఉండట‌మే కాదు శ‌రీరానికి బోలెడ‌న్ని పోష‌కాల‌ను అందిస్తాయి.వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే క‌డుపు నిండుగా ఉంటుంది.

దాంతో జంక్ ఫుడ్ పై మ‌న‌సు లాగ‌కుండా ఉంటుంది.ఇక అవ‌కాడో, యాపిల్‌, పుచ్చ‌కాయ‌, బీన్స్‌, ఓట్స్‌, వేరుశ‌గ‌న‌లు, అవిసె గింజ‌లు, గుమ్మ‌డి గింజ‌లు, చిల‌క‌డ‌దుంప‌లు వంటి ఆహారాలను తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.

ఈ కథానాయకులు ఇప్పుడు ప్రతినాయకులుగా చాలా బిజీ గా ఉన్నారు