ఆక‌లిని అదుపు చేయాలంటే ఈ లో-కేల‌రీ ఫుడ్స్‌ డైట్‌లో ఉండాల్సిందే!

ఆక‌లి అదుపులో లేకుంటే చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ళ్లి.ఏవి ప‌డితే అవి తినేస్తుంటారు.

దాంతో శ‌రీర బ‌రువు అదుపు త‌ప్పి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టు ముట్టేస్తాయి.

అందుకే ఆక‌లిని అదుపులో ఉంచుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.అయితే అందుకు కొన్ని లో కేల‌రీ ఫుడ్స్ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆల‌స్యమెందుకు ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుని డైట్‌లో చేర్చేసుకోండి. """/" / బెర్రీలు.

ముఖ్యంగా బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్‌బెర్రీ, బ్లాక్ బెర్రీలు లో కేల‌రీల‌ను క‌లిగి ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బెర్రీల‌ను రోజుకు అరక‌ప్పు చ‌ప్పున తీసుకుంటే అధిక ఆక‌లి త‌గ్గు ముఖం ప‌ట్టి చిరు తిండ్లపై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

అదే స‌మ‌యంలో మెద‌డు చురుగ్గా మారుతుంది.గుండె ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

మ‌రియు వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా రాకుండా ఉంటాయి.ట‌మాటా.

లో-కేల‌రీ ఆహారాల్లో ఇదీ ఒక‌టి.ట‌మాటాల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న క‌లిగి.

ఆక‌లి అదుపులో ఉంటుంది.అదే స‌మ‌యంలో ట‌మాటాల్లో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోష‌కాలు శ‌రీరానికి అంది ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.

కీర‌దోస‌.దీనిలో నీటి శాతం ఎక్కువ‌గా, కేల‌రీలు మ‌రియు పిండి పదార్ధాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి.

అందు వ‌ల్ల రోజూ కీర‌దోస‌ను తీసుకుంటే త‌ర‌చూ ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది.అదే స‌మ‌యంలో బాడీ డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉంటుంది.

ఆపిల్‌.రోజుకు ఒకటి చ‌ప్పున దీనిని తింటే గ‌నుక శ‌రీరానికి బోలెడంత శ‌క్తి ల‌భించి ఆకలి అదుపు త‌ప్ప‌కుండా ఉంటుంది.

మ‌రియు ఆరోగ్యానికి బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాలు సైతం ల‌భిస్తాయి. """/" / ఇక ఇవే కాకుండా ఓట్స్‌, రాజ్మా, మష్రూమ్స్, బ్రొకోలీ, కాలిఫ్లవర్, క్యాబేజీ, సెలరీ వంటి ఆహారాల్లోనూ కేల‌రీలు చాలా త‌క్కువగా ఉంటాయి.

పైగా ఇవి ఎక్కువ స‌మ‌యం పాటు క‌డుపు నిండిన భావ‌న‌ను క‌లిగిస్తాయి.కాబ‌ట్టి, వీటిని డైట్‌లో చేర్చుకుంటే చిరు తిండ్ల‌పై మ‌న‌సు మ‌ళ్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా బ‌రువూ కంట్రోల్‌లో ఉంటుంది.

పథకాల్లేవు ఏం లేవు.. మా ఆస్తులు ఇక్కడే ఉన్నాయ్.. బాబు సంచలన ఆడియో వైరల్!