గరుడ పురాణం ప్రకారం శివరాత్రి ఇలా జరుపుకోవాలి... అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహా శివుడి అనుగ్రహం పొందేందుకు మహాశివరాత్రి అత్యంత కీలకమైన రోజుగా పండితులు చెబుతారు.

శివరాత్రి రోజున ఉపవాసం చేసి జాగరణ చేస్తే కోరిక కోర్కెలు తీరడంతో పాటు, మోక్షం లభించి శివయ్యలో విలీనం అవుతారు అనేది కొందరు చెప్పే మాట.

అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తంలో ఉన్న హిందువులు నేడు మహా శివరాత్రి పండుగను పెద్ద ఎత్తున జరుపుకోవడం మనం చూస్తున్నాం.

అయితే మహా శివరాత్రి రోజున ఒకొక్కరు ఒక్కో విధంగా పూజా విధానం చేస్తారు.

ఎవరేం చేసినా కూడా ఆ మహా శివుడు అనుగ్రహిస్తాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / అయితే శివరాత్రి ఎలా జరుపుకోవాలనే విషయం గరుడ పురాణంలో ఉంది.

దాని ప్రకారం త్రయోదశి రోజునే మహాశివుడిని మనసులో ద్యానించి నేను చతుర్దశి రోజున జాగరణ చేయడంతో పాటు, నీరాహారిగా ఉంటాను అంటాను.

నాకు మోక్షం, ఆనందం ప్రసాధించండి అంటూ మనసులో ప్రార్థించుకోవాలి.శివరాత్రి సందర్బంగా మహాశివుడి పంచామృతాలతో అభిషేకం చేయాలి.

ఓం పంచాక్షరి మంత్రాలతో అభిషేకం పూర్తి చేయాలి.ఆ తర్వాత మహా శివలింగంను అలంకరించి చందన లేపంతో శివుడిని ఆరాధించాలి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / రోజంతా నిరాహారిగా ఉండి, రాత్రి సమయంలో శివ భజనలు చేస్తూ, శివారాధన చేస్తూ నిద్ర లేకుండా ఉండాలి.

రాత్రి సమయంలూ మూడు లేదా నాలుగు సార్లు హోమంను వెలిగిస్తూ ఉండాలి.సూర్యోదయం వరకు శివ నామస్మరణలో ఉండాలి.

సూర్యోదయం తర్వాత నిండైన స్థానం చేసి మహా శివుడిని మరోసారి వేడుకోవాలి.హే లోకేశ్వరా, నీ దయతో పూజ పరిపూర్ణం అయ్యింది, ఏదైనా తప్పులు జరిగితే క్షమించి, మీ కృపను మాకు ఇవ్వు.

మా పట్ల దయను కనబర్చి మమ్ములను మీలో ఏకం చేసుకోండి అంటూ నమస్కారం చేసుకోవాలి.

ఆ తర్వాత దైవ ప్రసాదంను తీసుకుని నిరాహార దీక్షను విరమించాలి.అలా శివరాత్రి పూజ చేస్తే మోక్షం దక్కుతుందని గరుడ పురాణంలో పేర్కొన్నడం జరిగింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px""/" / నేడు ఆ మహా శివుడి అనుగ్రహం మీకు కలగాలని, అందరికి ఆ మహా శివుడు కటాక్షం కలగాలని కోరుకుంటూ అందరికి మహా శివరాత్రి శుభాకంక్షలు.