రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టింది ఎవరో తెలుసా… ఈ పేరు వెనుక ఇంత కథ ఉందా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాజమౌళి( Rajamouli )ఒకరు.

ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్( Oscar ) వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డును కూడా సొంతం చేసుకున్నాయి.

ఇక ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే.ఈయన డైరెక్షన్లో సినిమా వస్తుందని తెలిస్తే చాలు సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతున్నాయి.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు( Mahesh Babu ) తో సినిమా చేస్తున్నారు.

"""/" / వచ్చేయేడాది జనవరి నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

ఇకపోతే రాజమౌళి విషయానికి వస్తే ఈయనని జక్కన్న( Jakkanna )అంటూ కూడా పిలుస్తూ ఉంటారు.

అసలు రాజమౌళికి ఆ పేరు ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే.

రాజమౌళి సినిమా పిచ్చోడు ఆయన చేసే సినిమాలో ప్రతి ఒక్క సన్నివేశం కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు.

అందుకు అనుకూలంగానే ఒక సన్నివేశాన్ని ఎన్ని విధాలుగా చిత్రీకరించవచ్చునో అన్ని విధాలుగా చిత్రీకరిస్తూ ఉంటారు.

అందుకే ఆయన్ను అందరూ జక్కన్న అని ముద్దుగా పిలుస్తారు.మరి ఆయనకు ఆ పేరు పెట్టింది ఎవరు అనే విషయానికి వస్తే.

"""/" / రాజమౌళికి ఈ పేరు పెట్టింది ప్రముఖ యాంకర్ సుమ భర్త నటుడు రాజీవ్ కనకాల( Rajeev Kanakala ).

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ విషయాన్ని బయటపెట్టారు.ఒకరోజు రాజమౌళితో అరపేజీ డైలాగ్ షూటింగ్ కోసం తనని పిలిచారట ఒక రెండు గంటలలో షూటింగ్ పూర్తి అవుతుందని నేను వెళ్ళాను కానీ ఆ అరపేజీ సన్నివేశం షూటింగ్ చేయటానికి రాజమౌళి ఏకంగా అర్ధరాత్రి 12:30 దాటినా పూర్తి చేయలేదని తెలిపారు.

వామ్మో! పని రాక్షసుడు.చెక్కుతున్నాడు సీన్లని జక్కనలా అని సరదాగా చెప్పారట అయితే ఆపేరే జక్కన్న అంటూ రాజమౌళికి ముద్ర పడిపోయిందని రాజీవ్ కనకాల తెలిపారు.

ఇక రాజీవ్ కనకాల రాజమౌళి ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు శాంతినివాసం సీరియల్ సమయం నుంచి వీరిద్దరీ పరిచయం ఏర్పడింది అప్పటినుంచి ఇప్పటివరకు రాజమౌళి సినిమాలలో ఈయన ఒక చిన్న పాత్రలో అయినా మనకు కనిపిస్తూ ఉంటారు.

అదానిపై బాబు చర్యలు తీసుకుంటారా ? ఒత్తిడి పెరుగుతోందా ?