ఈ కోతి తెలివికి మీరు నోరెళ్లబెట్టాల్సిందే ...!
TeluguStop.com
కుక్క- పిల్లి, ఎలుక-పిల్లి, కుక్క- కోతి, ఇవి నిత్య శత్రువులు.ఒక జీవికి మరో జీవి ఎదురు పడింది అంటే కొట్లాడుకోవడమే కాని ఫ్రెండ్ షిప్ చేయడం చాలా కష్టం.
సాధారణంగా కోతి, కుక్క ఒకేచోట ఉండవు.కుక్క కనిపిస్తే కోతి ఆ పరిసరాల్లో ఉండదు.
అయితే, దీనికి భిన్నంగా మరికొన్ని చోట్ల కుక్కలు, కోతులు జాతీవైరం మర్చిపోయి మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాయి.
కుక్క,కోతులు సరదాగా ఉండటం, వాటి చిలిపి చేష్టలు, నవ్వు తెప్పించే పనుల వంటి అనేక వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియలో వైరల్ గా మారాయి.
ఇప్పుడు ఇలాంటి వీడియోనే నెట్టింట హల్ చల్ చేస్తోంది.వివరాల్లోకి వెళ్తే ఒక కోతి షాపులో ఉన్న లేస్ ప్యాకెట్లను గమనించింది.
కానీ దానికి ఆ లేస్ ప్యాకెట్స్ అందేలా లేవు.దీంతో ఆ కోతి వాటిని ఎలాగైనా కాజేయాలని అనుకుంది.
అందుకోసం ఆ కోతి ఒక మాస్టర్ ప్లాన్ వేసింది.దీని కోసం అక్కడే నిల్చోని ఉన్న కుక్క వీపు మీద నిల్చుంది.
వెంటనే అక్కడే ఉన్న చిప్స్ ప్యాకెట్ ను తీసుకొవడానికి ట్రై చేసింది.చిప్స్ ప్యాకెట్ కోసం విశ్వ ప్రయత్నాలు అన్ని చేసింది.
ఆ తర్వాత.కుక్క మీద పడుకుంది.
ఈ సన్నివేశాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.
జంతువులకు సంబందించిన వీడియోలు అయితే ఇంకా వైరల్ అవుతుంటాయి.నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.
లైక్ చేస్తారు.కామెంట్ చేస్తారు.
ప్రస్తుతం ఈ వీడియో కూడా తెగ వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…