చేతిగోర్లు ఆ విధంగా ఉంటే వారిని ఎప్పటికీ నమ్మలేం!

సాధారణంగా మన భారతదేశంలో అనేక సాంప్రదాయాల తో పాటు, ఆచార వ్యవహారాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు.

వీటితో పాటు ఎక్కువగా జ్యోతిష్యశాస్త్రానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తారు.జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రికానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

చేతి గీతలను బట్టి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు భూత, భవిష్యత్ కాలాలను గురించి తెలియజేస్తుంటారు.

ఇందులో భాగంగానే మన చేతి గోర్లు ఏ విధంగా ఉంటే ఆ వ్యక్తులు ఎలాంటి స్వభావాలను కలిగి ఉంటారో, ఇక్కడ తెలుసుకుందాం.

కొంతమందికి గోర్లు తక్కువ ఎత్తులో ఉండి మొరటగా అనిపిస్తాయి.అటువంటి వారు ఆర్థికంగా ఎంతో ఉన్నప్పటికీ చురుకైన ఆలోచనలను చేయలేరు.

అంతేకాకుండా ఎవరికైతే గోర్లు చిన్నగా, పసుపు రంగును కలిగి ఉంటాయో అలాంటి వ్యక్తులు ఎక్కువగా అబద్ధాలు చెప్పే స్వభావాన్ని కలిగి ఉంటారు.

వారి స్వార్థం కోసం అవసరమైతే కుటుంబాన్ని మోసం చేయటానికి కూడా వెనకాడరు.ఎవరికైతే చిన్నగా, వెడల్పాటి గోర్లను కలిగి ఉంటారో అలాంటి వ్యక్తులు ఇతరులను విమర్శించడం ద్వారా ఆనందాన్ని పొందుతారు.

చదరపు ఆకారంలో గోర్లను కలిగినవారు, ఇతరుల పట్ల జాలి,కరుణతో ప్రవర్తిస్తారు.అంతేకాకుండా ఇలాంటి వారు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు.

అందువల్ల సమాజంలో అందరి చేత ప్రశంసలు కూడా పొందుతారు.సన్నగా, పొడవాటి గోర్లను కలిగి ఉన్నవారు, స్వతహాగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు.

ప్రతి చిన్న విషయానికి ఇతరుల పై ఎక్కువగా ఆధారపడుతుంటారు.గోర్లు వెడల్పుగా ఉండి, పైభాగంలో ఇరుకుగా ఉండే వారు ప్రతి విషయంలో ఎంతో చురుగ్గా ఉంటారు.

ఇలాంటి గోర్లను కలిగి ఉన్న వారు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంటారు.వేళ్ళు గుండ్రంగా ఉండి, తక్కువ ఎత్తులో ఉంటే అలాంటి వారు ఎంతో ప్రభావవంతంగా ఉండి, కుటుంబంలో వారి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారు.

పొడవాటి వెడల్పైన గోర్లను కలిగి ఉన్నవారు సొంత నిర్ణయాలు తీసుకోవడం లో ఎప్పుడూ ముందుంటారు.

ఇలాంటి వారికి తమ పనిలో ఎవరైనా జోక్యం చేసుకుంటే అస్సలు ఇష్టపడరు.ఈ విధంగా చేతి గోర్లను బట్టి వారి వ్యక్తిత్వాలను తెలుసుకోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

దేవర మూవీలో ఆ ట్విస్ట్ కు గూస్ బంప్స్.. ట్రైలర్ చూసిన వాళ్లెవరూ ఊహించలేరుగా?