లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నారా..! అయితే ఇలా చేయాల్సిందే..?
TeluguStop.com
చాలామంది ఇళ్లల్లో ప్రవేశించగానే మనకు లాఫింగ్ బుద్ధ ప్రతిమలు దర్శనమిస్తుంటాయి.లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందం, ఐశ్వర్యం కలిసి వస్తాయని చాలామంది విశ్వసిస్తుంటారు.
ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా, హాస్పిటల్స్, విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలలో కూడా ఈ విగ్రహాన్ని పెట్టుకుని ఉంటారు.
ఇది ఉండటం ద్వారా వారికి అభివృద్ధి కలిసి వస్తుందని భావిస్తుంటారు.అంతేకాకుండా మన కుటుంబం అనుభవిస్తున్న ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
ఇంతటి పవిత్రమైన ఈ లాఫింగ్ బుద్ధ మన ఇంటిలో ఏ దిశలో ఉంటే ఎటువంటి పరిణామాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మన ఇంటిలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పడమర దిశలో ఉంచినట్లయితే దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది.
మనం నివసించే ఇంటిలో లేదా ఆఫీసులలో లాఫింగ్ బుద్ధను ఉత్తరదిశలో ఉంచినట్లయితే వృత్తిపరంగా ఎంతో అభివృద్ధి చెందుతారు.
అయితే ఈ లాఫింగ్ బుద్ధను ఎప్పుడూ కూడా మన కంటికి కనిపించే అంత ఎత్తులో ఉంచుకోవాలి.
ఎటువంటి పరిస్థితులలో కూడా దీనిని నేలపై ఉంచరాదు.అలాగే ఈ విగ్రహాన్ని టాయిలెట్లకు, బాత్రూంలకు ఎదురుగా ఉంచరాదు.
తూర్పు దిశలో ఈ విగ్రహం పెట్టడం వల్ల కుటుంబానికి ఆరోగ్యం, ఆనందాన్ని చేకూరుస్తాయి.
"""/" /
ప్రతిరోజు ఒక్కసారైనా లాఫింగ్ బుద్ధ పొట్టపై కుడిచేతితో రుద్దటం వల్ల శుభం జరుగుతుంది.
అయితే చాలామంది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇలాంటి రూపంలో ఉంటే మంచిది, అలాంటి రూపంలో ఉండకూడదని చెబుతుంటారు.
ఇవన్నీ కేవలం వారి అపోహలు మాత్రమే.అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ వాటి అర్థం, పరమార్థం మాత్రం ఆనందం, ఐశ్వర్య, ఆరోగ్యం.
అయితే ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహానికి ఎంతో పరమ పవిత్రమైనదిగా భావించాలి.
వదల బొమ్మాళీ వదల అంటూ పుట్టగానే కత్తెర పట్టుకున్న పసిబిడ్డ.. వైరల్ వీడియో!