ఈ యాక్టర్స్ డబ్బింగ్ కూడా చెప్పారంటే ఎవరు నమ్మరు ..!
TeluguStop.com
సాధారణంగా సినిమాల్లో యాక్టర్లుగా నటించేవారు మల్టీ టాలెంటెడ్ అయి ఉంటారు.ఓన్లీ నటించడమే కాకుండా మంచిగా డ్యాన్స్ చేస్తారు.
పాటలు పాడతారు, కథలు రాస్తారు.సినిమాలను డైరెక్ట్ కూడా చేస్తారు.
ఇలాంటి మల్టిపుల్ టాలెంట్స్ చాలామందిలో ఉంటాయి.కొందరిలో అయితే అదనపు ప్రతిభలు కూడా ఉంటాయి.
అలాంటి ప్రతిభల్లో డబ్బింగ్ చెప్పడం ఒకటి.ఒకప్పుడు యాక్టర్లకు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పేవారు.
ఇప్పుడు ఎవరి డబ్బింగ్ వారే చెప్పుకుంటున్నారు.కొందరు మాత్రమే ఇప్పటికీ వేరే వారిపై ఆధారపడుతున్నారు, అది వేరే సంగతి.
అయితే ఆరుగురు సెలబ్రిటీలు మాత్రం సొంత పాత్రలకు చక్కగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అద్భుతంగా డబ్బింగ్ చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఆ సెలబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.h3 Class=subheader-style• ఉత్తేజ్:/h3p
తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ ఉత్తేజ్( Uttej ) మంచి నటుడు మాత్రమే కాదు మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా.
మొదటగా ఈ నటుడు "వెన్నెల" సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాడు.
శ్రద్ధగా వింటే ఆ యాసలో మాట్లాడింది ఉత్తేజే అనే విషయం తెలుస్తుంది.దీని తర్వాత పొగరు సినిమాలో వడివేలు, నేనే అంబానీ సినిమాలో ఎన్.
సంతానం పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పాడు. """/" /
H3 Class=subheader-style• రాశి:/h3p
శుభకాంక్షలు, గోకులంలో సీత, పెళ్లి పందిరి వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేసింది అలనాటి హీరోయిన్ రాశి.
( Raasi ) 2017 తర్వాత ఆమె ఏ సినిమాలో కూడా యాక్ట్ చేయలేదు.
అయితే ఈ తార కూడా కొన్ని క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పింది.లక్ష్మీ కళ్యాణం సినిమాలో లక్ష్మిగా కాజల్ అగర్వాల్ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.
ఈ పాత్రకు వాయిస్ డబ్బింగ్ చెప్పింది మరెవరో కాదు రాశినే! అలానే కేక సినిమాలో ఇషానా అనే ఒక నటీమణికి కూడా డబ్బింగ్ చెప్పింది.
మిర్చి సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన నదియా క్యారెక్టర్ కి కూడా రాశినే డబ్బింగ్ చెప్పిందని అంటారు.
"""/" /
H3 Class=subheader-style• దేవీ శ్రీ ప్రసాద్/h3p
మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్( Devisri Prasad ) "లాహిరి లాహిరి లాహిరిలో" సినిమాలోని ఆదిత్య ఓం పాత్రకు వాయిస్ ఓవర్ అందించాడు.
"""/" /
H3 Class=subheader-style• కార్తీ/h3p
బ్రదర్స్ (2012) సినిమాలో సూర్య విమలన్, అఖిలన్ వంటి డ్యూయల్ రోల్స్ పోషించాడు.
అయితే ఇందులో విమలన్ క్యారెక్టర్‌కు కార్తినే( Karthi ) డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచాడు.
"""/" /
H3 Class=subheader-style• నిత్యా మీనన్/h3p
గుండె జారి గల్లంతయ్యిందే (2013) సినిమాలో నితిన్, నిత్యా మీనన్( Nithya Menon ) హీరో హీరోయిన్లుగా నటించారు.
సెకండ్ హీరోయిన్‌గా ఇషా తల్వార్ యాక్ట్ చేసింది.అయితే తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా ఇషా తల్వార్‌కి కూడా వాయిస్ ఓవర్ అందించింది.
ఫ్రొజెన్ 2 (2019) తెలుగు డబ్డ్ వెర్షన్‌లో ఎల్సా పాత్రకు కూడా గాత్ర దానం చేసింది.
"""/" /
H3 Class=subheader-style• తరుణ్/h3p
అనుకోని అతిథి సినిమాలో ఫహద్ ఫాసిల్ పాత్రకు అలనాటి హీరో తరుణ్( Tharun ) వాయిస్ ఓవర్ అందించాడు.
రెండేళ్లుగా సినిమా లేదు.. అయినా అవార్డ్.. సమంత ఎమోషనల్ కామెంట్స్ వైరల్!