కేవలం ఈ 4 పదార్థాలతోనే నెల రోజుల్లో జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు!
TeluguStop.com
అధిక హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ లేకపోవడం వంటి కారణాల వల్ల కొందరి జుట్టు చాలా పలుచగా మారుతుంది.
ఇలాంటివారు ఎంతగానో హైరానా పడిపోతుంటారు.మళ్లీ జుట్టును ఒత్తుగా ఎలా మార్చుకోవాలో తెలియక లోలోన మదన పడిపోతూ ఉంటారు.
అయితే అస్సలు వర్రీ అవ్వకండి.మీరు టెన్షన్ పడే కొద్ది మీ జుట్టు మరింత ఎక్కువగా రాలుతుంది.
దానికి బదులుగా ఇప్పుడు చెప్పబోయే నాలుగు పదార్థాలతో జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు ప్రయత్నించండి.
కేవలం ఈ నాలుగు పదార్థాలతోనే నెల రోజుల్లో ఒత్తైన జుట్టును పొందొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నాలుగు పదార్థాలు ఏంటి.
వాటిని జుట్టుకు ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందు నాలుగు నుంచి ఐదు మందారం ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
అలాగే మూడు లేదా నాలుగు మందార పువ్వులను తీసుకుని వాటర్ తో కడిగి పెట్టుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ లో మందారం ఆకులు మరియు పువ్వులు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.
వారంలో కేవలం రెండు సార్లు ఈ హెయిర్ ప్యాక్ ను కనుక వేసుకుంటే మందారం పువ్వులు మరియు ఆకులు తో పాటు కొబ్బరి నూనె ఆముదంలో ఉండే పలు పోషకాలు జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తాయి.
హెయిర్ ఫాల్ సమస్యను కంట్రోల్ చేస్తాయి.జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేందుకు తోడ్పడతాయి.
కాబట్టి ఎవరైతే పల్చటి జుట్టుతో తీవ్రంగా మదన పడుతున్నారో వారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను వేసుకునేందుకు ప్రయత్నించండి.
జుట్టును ఒత్తుగా మార్చుకోండి.
ట్రంప్ గెలుపు బైడెన్‌కు ముందే తెలుసా? కమలను ముంచేశారా? .. ఒబామా సన్నిహితుడి వ్యాఖ్యలు