ఈ మూడు పదార్థాలతో వారం రోజుల్లోనే ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.. తెలుసా?
TeluguStop.com
ముఖం తెల్లగా మెరిసిపోతూ కనిపించాలని అందరూ కోరుకుంటారు.అందుకోసమే ముఖ చర్మంపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
మార్కెట్‌లో లభ్యమయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.కొందరైతే ముఖాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం ఏవేవో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే మూడు పదార్థాలతోనే వారం రోజుల్లో ముఖాన్ని తెల్లగా మెరిపించుకోవచ్చు.
మరి ఆ మూడు పదార్థాలు ఏంటీ.? వాటిని చర్మానికి ఏ విధంగా ఉపయోగించాలి.
? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి.
చివరిగా అందులో సరిపడా పచ్చకాయ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. """/"/ ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సాయంతో ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.
కంప్లీట్ గా డ్రై అయిన అనంతరం ఐస్ వాటర్ తో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఆపై ఏదైనా మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ హోం రెమెడీని పాటిస్తే గనుక.
ఆరెంజ్ పీల్ పౌడర్, కాఫీ పౌడర్ మరియు పుచ్చకాయ జ్యూస్‌లో ఉండే పలు సుగుణాలు ముఖ చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మారుస్తాయి.
అదే సమయంలో చర్మంపై ఏమైనా మచ్చలు ఉన్నా.వాటిని క్రమంగా మాయం చేస్తాయి.
ముఖాన్ని వైట్‌గా, బ్రైట్ గా మెరిపించుకోవాలని ఆరాటపడేవారు తప్పకుండా ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీని పాటిస్తే.
వైట్‌హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా భారత సంతతి జర్నలిస్ట్.. ట్రంప్ ప్రకటన