ఈ ప్రభుత్వ స్కీమ్‌తో కోటీశ్వరులు కావొచ్చు.. ఎన్నేళ్లు పెట్టుబడి పెట్టాలంటే..

కోటీశ్వరులు కావాలని ఎవరికి మాత్రం వుండదు? మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది.ఆ ఆశలు నెరవేర్చుకోవడం కొంతమందికి చాలా కష్టం అయినప్పటికీ కొన్ని పథకాలతో అది సులభంగా నెరవేరుతుందని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.

అవును, నెలకు రూ.వేలల్లో ఇన్వెస్ట్ చేసినా కోటీశ్వరులను చేయగలిగే అద్భుతమైన పెట్టుబడి పథకాలు భారత్‌లో అందుబాటులో ఉన్నాయని అంటున్నారు.

వాటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌( Public Provident Fund ) ఒకటి.

భారతదేశంలో ఎక్కువ కాలం పాటు డబ్బు ఆదా చేయాలనుకునే పెట్టుబడిదారులకు ఇది ఉత్తమ ఎంపిక అని అంటున్నారు.

"""/" / విషయం ఏమిటంటే 2023, ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం 7.

1% వార్షిక వడ్డీని అందిస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.కొంతకాలంగా ప్రభుత్వం ఈ వడ్డీ రేటును మార్చలేదు.

ఆసక్తి ఉన్నవారు సమీపంలోని ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో PPF అకౌంట్ ఒకదానిని తీసుకోవచ్చు.

ఏటా PPF అకౌంట్‌లో కనీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

అత్యధికంగా రూ.1.

5 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు.అయితే PPF నుంచి డబ్బును తిరిగి పొందడానికి కనీసం 15 ఏళ్లు వెయిట్ చేయాల్సి వుంటుంది మరి.

"""/" / ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే పీపీఎఫ్‌తో చాలా డబ్బు సంపాదించవచ్చని చెబుతున్నారు.

ఈ సేవింగ్స్ స్కీమ్‌ కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో పెట్టుబడిదారులను ధనవంతులను చేయగలదని నిపుణులు అంటున్నారు.

కాంపౌండింగ్ అంటే వడ్డీపై వడ్డీ రావడం అన్నమాట.ఈ లాంగ్-టర్మ్ సేవింగ్స్( Long-term Savings ) అకౌంట్‌ను కావలసినంత కాలం ఉంచుకోవచ్చు.

గడువు ముగిసిన ప్రతిసారీ మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.ఇలా చేసినప్పుడు అకౌంట్‌లో ఎక్కువ డబ్బును పెట్టుబడి పెడుతూ వుండాలి.

సింపుల్‌గా చెప్పాలంటే, PPF ఖాతాలో రూ.కోటి కంటే ఎక్కువ సంపద క్రియేట్ చేయవచ్చు.

అంత మొత్తం డబ్బుతో హ్యాపీగా రిటైర్ కావచ్చు.మొత్తంగా PPFలో ఓ పాతికేళ్లు పెట్టుబడి పెడితే సులభంగా కోటీశ్వరులు కావచ్చని అంటున్నారు.

నెల రోజులలో 9 కోట్ల సాయం.. మెగా మంచి మనసుకు ఫిదా అవ్వాల్సిందే!