మీరే నా సూపర్ స్టార్.. లవ్ యు నాన్న మహేష్ పోస్ట్ వైరల్!
TeluguStop.com
సూపర్ స్టార్, నటశేఖరుడు దివంగత కృష్ణ గారు మరణించి నేటికి పది రోజులు గడిచిపోయింది.
పది రోజులు అయినప్పటికీ ఈయన మరణ వార్త ఇప్పటికీ జీర్ణించుకోలేని విషయంగా మారింది.
ఇక మహేష్ బాబు కుటుంబ సభ్యులకు తన తండ్రి మరణ వార్త ఇప్పటికీ మింగుడు పడలేదు.
కృష్ణ గారు మరణించిన అనంతరం మహేష్ బాబు కొడుకుగా తన తండ్రికి నిర్వర్తించాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు.
ఇక తండ్రి మరణం తర్వాత మొదటిసారిగా మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
ఈ క్రమంలోనే మహేష్ బాబు కృష్ణ గారి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మీరు మీ జీవితంలో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపారు.
ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా సాహసం.ధైర్యం మీ వ్యక్తిత్వం అనేలా జీవించారు.
ఈ విధంగా ఈ విషయాలన్నింటినీ మీ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నాను అయితే ఈ అంశాలన్నీ కూడా మీతోనే వెళ్లిపోయాయి.
ఇకపై నాలో మునపటిలా భయం లేదు ఎంతో ధైర్యంగా మరింత బలంతో ఉన్నాను.
నాలో ఎల్లప్పుడూ మీ కాంతి ప్రసరిస్తూనే ఉంటుంది. """/"/
ఇలాగే నేను మీ వారు సత్వాన్ని కొనసాగిస్తూ.
మీరు మరింత గర్వపడేలా చేస్తాను.మీరే నా సూపర్ స్టార్ ఐ మిస్ యు.
లవ్ యు నాన్న అంటూ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ తన తండ్రి గురించి మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ పోస్ట్ చూసినటువంటి ఎంతోమంది అభిమానులు ధైర్యంగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.
“ఫాస్ట్‌గా రా.. మూడ్‌లో ఉన్నా”: ఉబర్ డ్రైవర్ అసభ్య మెసేజ్‌లు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే..