ముస్లింలను కూడా మంత్రివర్గంలోకి తీసుకున్న యోగి ఆదిత్యనాథ్..!!
TeluguStop.com
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో యూపీలో బీజేపీ గెలవడం తెలిసిందే.
కాగా నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు.లక్నోలో అటల్ బిహారీ వాజపాయ్ ఎకానా స్టేడియంలో ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు బీజేపీ పాలిత ముఖ్య మంత్రుల పలువురు కేంద్ర మంత్రులు.
ఇంకా బీహార్ సీఎం నితీష్ కుమార్ అతిధుల సమక్షంలో.యోగి ఆదిత్య నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదే కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ తో పాటు 52 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
అయితే తన మంత్రి వర్గంలో ఒక ముస్లిం కి కూడా యోగి ఆదిత్యనాథ్ చోటిచ్చారు.
దానిష్ ఆజాద్ అన్సారీ కి.చోటు కల్పించారు.
చాలా కాలం తర్వాత యూపీలో వరుసగా రెండోసారి ముఖ్య మంత్రి అయిన వ్యక్తి గా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సృష్టించారు.
ఇదిలా ఉంటే కొత్తగా ఏర్పడిన క్యాబినెట్ మంత్రులతో మొదటి సమావేశం లోనే దాదాపు రెండు గంటల పాటు.
వారితో రాష్ట్రానికి సంబంధించి అనేక విషయాలపై యోగి ఆదిత్య నాథ్ చర్చించటం విశేషం.
మంచు విష్ణు కన్నప్ప మూవీ తో సక్సెస్ కొడతాడా..?