మళ్ళి రి ఎంట్రీ ఇస్తున్న నిన్నటి తరం కథానాయికలు వీరే

మన తెలుగు సినిమా పరిశ్రమ చాలా గొప్పది అని ఎంతో మంది చెబుతుంటారు.

దానికి కారణం ఒకప్పుడు ఎంతో మంది గొప్ప నటీనటులు వాళ్ళ గొప్ప నటన తో ప్రేక్షకుల్ని మైమరిపించే వాళ్లు.

అయితే కాలక్రమేణా కొత్త నటీనటులు రావడం వల్ల ఎంతో గొప్పగా నటిస్తున్నప్పటికీ కొత్త వాళ్ళని ఎక్కువగా అవకాశాలు రావడంతో సీనియర్ నటీనటులు కాస్త గ్యాప్ తీసుకోక తప్పదు.

కానీ ఇప్పుడు అలాంటి గొప్ప నటీనటుల అందరికీ కూడా మళ్ళీ మంచి అవకాశాలు ఇస్తుంది మన తెలుగు సినిమా పరిశ్రమ.

దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ తెలుగుతెరమీద సందడి చెయ్యబోతోంది నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన సీనియర్ హీరోయిన్ అర్చన.

ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిదే.అప్పట్లో తెలుగు వాళ్ళని కట్టిపడేసిన హీరోయిన్.

నిరీక్షణ, భారత్ బంద్ లాంటి ఇంపాక్ట్ సినిమాలతో చరిత్ర క్రియేట్ చేసిన అర్చన మళ్లీ 25 ఏళ్ల తర్వాత ఆకాష్ పూరి చోర్ బజార్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ తో కమ్ బ్యాక్ అవుతోంది.

జీవన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆమెని మళ్ళీ చూడడం నిజంగా మన అదృష్టం.

"""/" / అర్చన గారి లాగే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత సందడి చెయ్యబోతున్న మరో హీరోయిన్ భాగ్యశ్రీ.

ప్రేమపావురాలు సినిమాతో ఇండియాని మొత్తం ఊపేసిన ఈ అందాల భామ ఇప్పుడు ప్రభాస్ కు తల్లిగా రాధేశ్యామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.

సో, మార్చి 11న రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ లో భాగ్యశ్రీ గారిని మరొక్కసారి మనం చూడొచ్చు.

ఇక అటు నార్త్ లోనూ ఇటు సౌత్ లోనూ స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రవీనా టాండన్ గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేము.

ఈమె కూడా చాలా గ్యాప్ తర్వాత మల్లీ తెలుగు తెరమీద హడావిడ చెయ్యబోతోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కెజిఎఫ్ 2లో ప్రైమ్ మినిస్టర్ గా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తోంది రవీనా.

"""/" / తమిళ్ లో ఏ హీరోయిన్ కైనా గుడి కట్టారు అంటే అది ఖుష్బూమాత్రమే.

అలాంటి కుష్బూ గారు కూడా లేటెస్ట్ గా ఆడవాళ్లూమీకుజోహార్లు సినిమాతో ఫుల్ లెన్త్ ఇంట్రస్టింగ్ రోల్ చేస్తూ.

గ్లామర్ టచ్ ఇస్తున్నారు.గోపీచంద్-దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా ఖుష్బూ ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

"""/" / ఇక తెలుగులో పెద్దగా సినిమాలు చేయనప్పటికి తమిళ్ లో తన కామెడీతో అదరగొట్టే పర్ఫామెన్స్ ఇచ్చినా హీరోయిన్ ఊర్వశి.

మందరికి ఎప్పటికీ గుర్తు ఉంటుంది.డబ్బింగ్ సినిమాలతోనే ఆడియన్స్ కి దగ్గరైన ఈ సీనియర్ హీరోయిన్.

ఆ మధ్య గోపీచంద్ జిల్ సినిమాలో పిన్నిగా నటించగా.ఇప్పుడు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా ద్వారా మళ్లీ నవ్వించడానికి రెడీ అయిపోయింది.

ఇక ఈ లిస్ట్ లో హీరోయిన్ రాధిక గారు కూడా వచ్చి చేరారు.

అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ఊపేసిన రాధిక గారు ఇప్పుడు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా ద్వారా మళ్లీ మన ముందుకు రాబోతున్నారు.

ఆ సినిమాలో శర్వానంద్ తో పాటు ఫుల్లు కామెడీ పండించిన ఆడవాళ్లందరిలో మన రాధికమ్మా కూడా ఒకరు.

ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో సినిమాలు చేస్తోంది.ఇక ఈ లిస్ట్ లో సీరియల్ హీరోయిన్ అమల కూడా వస్తుంది.

ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది అమల.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!