బిగ్‌బాస్‌ 3 : మా సర్వే నిజం అయ్యింది, మేం చెప్పిందే జరిగింది

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ఆరంభం నుండి మేము రెగ్యులర్‌గా అప్‌డేట్స్‌ ఇస్తూ వస్తున్నాం.

షో కు సంబంధించిన కీలక విశ్లేషణలు ఇచ్చాం.ప్రేక్షకులు బిగ్‌బాస్‌పై ఎంతగా ఆధరాభిమానాలు కనబర్చారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక బిగ్‌బాస్‌ సీజన్‌ 3 కి సంబంధించి చివరి విషయంకు వచ్చాం.రెండు రోజుల క్రితం మేము ప్రచురించిన ఒక కథనంలో బిన్నర్‌గా రాహుల్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చాం.

వారం ముందు వరకు శ్రీముఖికి ఎక్కువ ఛాన్స్‌ ఉన్నా రాహుల్‌కు అనూహ్యంగా మద్దతు పెరిగిందని చెప్పాం.

రాహుల్‌ సిప్లిగంజ్‌కు సోషల్‌ మీడియాలో పెరిగిన క్రేజ్‌ను బట్టి ఆయన విన్నర్‌ అంటూ మేము విశ్లేషించాం.

మేము సోషల్‌ మీడియాలో నిర్వహించిన పోల్‌లో కూడా రాహుల్‌ విజయం సాధించబోతున్నట్లుగా అంతా ఘంటా పథంగా చెప్పారు.

అందుకే మేము కూడా చాలా నమ్మకంతో రాహుల్‌ విజయాన్ని సొంతం చేసుకుంటాడని చెప్పాం.

అన్నట్లుగానే మా అంచనా నిజమైంది.రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ 3 ట్రోఫీని మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు.

"""/"/శ్రీముఖి కూడా చాలా టఫ్‌ ఫైట్‌ ఇచ్చింది.ఇద్దరిలో చాలా తక్కువ తేడా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఓట్ల పరంగా చూస్తే ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు సాధించారు.

కాని ఇక్కడ అనూహ్యమైన ట్విస్ట్‌ ఏంటీ అంటే వరుణ్‌ సందేశ్‌ టాప్‌ 3 లో ఉంటాడు అనుకుంటే బాబా భాస్కర్‌ ఆ స్థానంలో నిలిచాడు.

అంతా ఊహించినట్లుగానే అలీ 5వ స్థానంలో ఉండగా నాల్గు మరియు మూడవ స్థానాల్లో కూడా చాలా టఫ్‌ కాంపిటీషన్‌ నెలకొంది.

ఇద్దరు కూడా స్వల్ప ఓట్ల తేడాతో నిలిచారు.మొత్తానికి ఈ సీజన్‌లో రాహుల్‌ అత్యధిక సార్లు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయినా సేవ్‌ అవుతూ వచ్చాడు.

అలాగే చివరి వారంలో కూడా సేవ్‌ అయ్యి ట్రోఫీ సాధించాడు.కంగ్రాట్స్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.

బాలీవుడ్ కల్చర్ కి అలవాటు పడిన తారక్.. ఏకంగా భార్యని కూడా తీసుకెళ్లాడుగా?