జగన్ టార్గెట్‌గా ఎల్లో మీడియా కొత్త స్కెచ్..!
TeluguStop.com
మీడియా కూడా ఇప్పుడు రాజకీయ బాటలోనే నడుస్తోందని అంటున్నారు పరిశీలకులు.కుదిరితే ఒకరకంగా కుదరకపోతే మరోరకంగా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, మాటలు రువ్వుకోవడం మనకు తెలిసిందే.
ఇప్పుడు ఇదే పద్ధతిని.రాష్ట్రంలో ఓ వర్గం మీడియా కూడా అనుసరిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
జగన్ సర్కారు ఏర్పడడాన్ని జీర్ణించుకోలేని ఓ వర్గం మీడియా.ఆయన ప్రభుత్వంపైన, మంత్రులపైన కూడా విమర్శలకు తావిస్తూ.
అనేక కథనాలు వండివార్చుతున్న విషయం తెలిసిందే.అయితే, ఇది నిన్నమొన్నటి వరకు ఉన్న పద్ధతి.
అయితే, ఇప్పుడు ఈ వ్యూహాన్ని సదరు మీడియా మార్చుకుంది.కథనాలు, వ్యతిరేక వార్తలు రాస్తూనే.
మరోపక్క, సెంటిమెంటును రెచ్చగొట్టే దిశగా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.దీనికి ఉన్న అన్ని మార్గాలనూ అనుసరిస్తోంది.
బీసీలను రెచ్చగొట్టి.తాజాగా ఓ వర్తా కథనం వచ్చింది.
బీసీలకు ఇతర కులాల వారికీ వైసీసీ అధినేత, సీఎం పదవులు పందేరం చేశారని, కానీ వీరికి ఏంటి లాభం.
అంటూ రాసుకొచ్చిన కథనంలో స్పష్టంగా ఉన్నది రెచ్చగొట్టే ధోరణి.నిజానికి గతంలో చంద్రబాబు ఏర్పాటు చేయని కమిటీలను ఇప్పుడు ఏర్పాటు చేశారు.
అనేక కులాలు, ఉపకులాలకు కూడా తాజాగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.మహిళలకు భారీగా పదవులు ఇచ్చారు.
త్వరలో ఆయా కార్పొరేషన్లకు నిధులు కూడా మంజూరు చేస్తారు.ఇది నిజానికి ఆయా వర్గాలకు మేలు చేసే కార్యక్రమం.
ఇప్పటికే ఉన్న బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్‌లకు మాదిరిగా ఇతర కులాలకు కూడా ఏర్పాటు చేశారు.
అయితే,ఇది రాజకీయంగా టీడీపీని తీవ్రంగా ఇరకాటంలో పడేస్తుందని గ్రహించిన ఆయన అనుకూల మీడియా.
దీనికి భిన్నంగా.ఆయా కులాలను రెచ్చగొట్టేలా.
సెంటిమెంటును తెరమీదికి తీసుకువచ్చింది.ఈ కార్పొరేషన్ వల్ల ఒనగూరే ప్రయోజనం లేదని పేర్కొంటూ.
కథనాలు రాయడం వెనుక చాలా వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు.
వైరల్: భలే దొంగ… సినిమా ఛేజింగులు కూడా పనికిరావు!