తెలంగాణకు పసుపు బోర్డు..: మోదీ

మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా రూ.

13,500 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.అనంతరం తెలంగాణకు పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు.

గత ఎన్నికల్లో తెలంగాణలో రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు పసుపు రైతుల కోసం టర్మరిక్ నేషనల్ బోర్డును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

దాంతో పాటు ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ నిర్మిస్తామని తెలిపారు.ఈ క్రమంలో సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?