కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా యడ్యూరప్ప కొడుకు..!!
TeluguStop.com
ఈ ఏడాది మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమి చెందటం తెలిసిందే.
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా నిలవగా.
కేంద్ర మంత్రులు మరియు మోడీ భారీగా ప్రచారం చేశారు.అయినా గాని కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
బీజేపీ ఘోరంగా ఓటమి చెందింది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా బీజేపీ అధిష్టానం కర్ణాటకలో.
బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు ఎమ్మెల్యే విజయేంద్ర యడ్యురప్పను.నియమించడం జరిగింది.
ఈ క్రమంలో బీజేపీ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా.ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
"""/" /
విజయేంద్ర నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని జారీ చేసిన ఆదేశాలలో స్పష్టం చేశారు.
విజయేంద్ర యడ్యూరప్ప గత ఎన్నికలలో షికరీపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది.
ఇప్పటివరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహించటం జరిగింది.50 ఏళ్ల విజయేంద్ర యడ్యూరప్ప న్యాయవిద్యను అభ్యసించి పార్టీ యువ విభాగం భారతీయ జనతా యువమోర్చా కర్ణాటక యూనిట్ కు జనరల్ సెక్రటరీగా పనిచేశారు.
ఆ తర్వాత 2020 నుండి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రాణిస్తున్నారు.అయితే తాజాగా మాత్రం కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా విజయేంద్రను నియమిస్తూ శుక్రవారం సాయంత్రం బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది.
డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యమే.. కానీ ఎవరెవరు తినకూడదో తెలుసా..?