2024 సంవత్సరంలో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలివే.. భారీగా నష్టాలు వచ్చాయిగా!
TeluguStop.com
2024 సంవత్సరంలో స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందుకున్నాయి.
గుంటూరు కారం, కల్కి 2898 ఏడీ, దేవర, పుష్ప ది రూల్ సినిమాలు ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.
ఈ నాలుగు సినిమాలు మినిమం గ్యాప్ తో రిలీజ్ కావడం ఆయా సినిమాలకు ఒక విధంగా ప్లస్ అయిందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
అయితే ఈ ఏడాది డబ్బింగ్ భారీ బడ్జెట్ సినిమాలలో మెజారిటీ సినిమాలు నిరాశపరిచాయి.
ఈ ఏడాది రజనీకాంత్ లాల్ సలామ్,( Lal Salaam ) వేట్టయన్( Vettaiyan ) సినిమాలతో పేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలు నిర్మాతలను ముంచేశాయి.
కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇండియన్2( Indian 2 ) మూవీ అత్యంత భారీ అంచనాలతో విడుదల కాగా ఫ్లాప్ అయింది.
"""/" /
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువ( Kanguva ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా నిర్మాతలను నిలువునా ముంచేసింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి 2024 కలిసొచ్చినా కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రం 2024 పెద్దగా కలిసిరాలేదు.
ఈ సినిమాలు మిగిల్చిన నష్టం 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంటుందని సమాచారం అందుతోంది.
2025 అయినా ఈ హీరోలకు కలిసొస్తుందేమో చూడాలి. """/" /
2025 సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది.
2025 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా క్రేజీ సినిమాలు రిలీజవుతున్నాయి.చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్, వెంకటేశ్, నాగార్జున, రామ్ చరణ్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.
మరీ భారీ బడ్జెట్ సినిమాల వల్ల ఇండస్ట్రీకి లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిర్మాతలు, దర్శకులు సైతం ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.ఓటీటీల హవా నేపథ్యంలో ప్రేక్షకులు కొన్ని సినిమాలను మాత్రమే థియేటర్లలో చూడటానికి ఇష్టపడుతున్నారు.
రుణమాఫీపై తీపి కబురు అందేనా…?