2023 సంవత్సరంలో భారీ డిజాస్టర్లు ఇచ్చిన దర్శకులు వీళ్లే.. నష్టాలు మిగిల్చిన సినిమాలివే!

2023 సంవత్సరం ముగింపుకు మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి మరీ భారీ స్థాయిలో కలిసిరాలేదు.

ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో మెజారిటీ సినిమాలు నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.

కొన్ని సినిమాలు దర్శకులకు కూడా బ్యాడ్ నేమ్ తెచ్చిపెట్టాయి.కొంతమంది దర్శకులకు ఇప్పట్లో కొత్త ఆఫర్లు రావడం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

"""/" / ఈ ఏడాది భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఆదిపురుష్( Adipurush Movie ) ఒకటి కాగా ఓం రౌత్( Om Raut ) దర్శకత్వం వహించిన ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

ఈ సినిమాలో ప్రభాస్ లుక్ విషయంలో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి.శ్రీవాస్( Sriwass ) డైరెక్షన్ లో తెరకెక్కిన రామబాణం సినిమా( Ramabanam Movie ) కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో ఫెయిలైంది.

50 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కగా 5 కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా రాలేదు.

"""/" / గుణశేఖర్( Gunasekhar ) డైరెక్షన్ లో శాకుంతలం( Shaakuntalam ) తెరకెక్కగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.

అల్లు అర్హ క్యామియో రోల్ లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు భారీ షాకిచ్చింది.

మెహర్ రమేష్( Meher Ramesh ) డైరెక్షన్ లో తెరకెక్కిన భోళా శంకర్( Bhola Shankar ) సినిమా సైతం నిర్మాతలను ముంచేసింది.

అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన ఏజెంట్ మూవీ( Agent Movie ) నిర్మాత అనిల్ సుంకరను ముంచేసింది.

"""/" / ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీలో రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే.

కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన స్కంద, నాగచైతన్య కస్టడీ, రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు.

శ్రీకాంత్ అడ్డాల, వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన పెదకాపు1, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.

బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా.. పృథ్వీకి బదులుగా అతను ఎలిమినేట్ అయ్యాడా?