వైసీపీకి సోషల్ మీడియానే బలం..: సీఎం జగన్
TeluguStop.com
విశాఖ( Visakhapatnam ) రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని సీఎం జగన్ అన్నారు.
ప్రస్తుతం విశాఖ హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడుతుందని తెలిపారు.విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖీ( CM Jagan ) నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.వైసీపీకి సోషల్ మీడియానే బలమని సీఎం జగన్ పేర్కొన్నారు.
విజయానికి మనం చేరువలో ఉన్నామనే దానికి సోషల్ మీడియాలో మనపై జరుగుతున్న దాడే నిదర్శనమని తెలిపారు.
అయితే సోషల్ మీడియాలో వేధింపులకు గురయిన వారికి పార్టీ అండగా ఉంటుందని సీఎం జగన్ చెప్పారు.
పైన దేవుడు అండతో పాటు ఇక్కడ ప్రజల సపోర్ట్ ఉందని తెలిపారు.
కొరియన్ భర్తకి పరీక్ష పెట్టిన ఇండియన్ భార్య.. వీడియో చూస్తే నవ్వే నవ్వు..