ఏపీలో వైసీపీ ప్రభంజనం ఖాయం.. తేల్చేసిన టీడీపీ

ఏపీలో మరోసారి వైసీపీ( YCP )నే అధికారంలోకి రాబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది.

ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాల ప్రకారం రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనం కొనసాగిస్తుందని సమాచారం.

లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ గాలి గట్టిగా వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే కొలువుదీరుతుందని తెలుస్తోంది.సర్వే ఫలితాలే కాదు.

ప్రతిపక్ష పార్టీలు సైతం వైసీపీదే గెలుపనే క్లారిటీ వచ్చేశాయట.రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

ఓ వైపు అధికార పార్టీగా ఉన్న వైసీపీ మరోవైపు కూటమిగా వెళ్తున్న టీడీపీ( TDP ) ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

అధికారంలోకి రావడమే లక్ష్యం సర్వశక్తులు ఒడ్డుతున్నాయన్న సంగతి తెలిసిందే.సుమారు ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని, పేదలకు అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ వైసీపీ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది.

మ్యానిఫెస్టోను 99 శాతం అమలు పరచడమే కాకుండా నవరత్నాలను ప్రజలకు అందించారనడంలో ఏ మాత్రం అనుమానం అవసరం లేదు.

ప్రతి ఇంటి గడపకు సంక్షేమాన్ని అందించిన ఏకైక ప్రభుత్వంగా వైసీపీ ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకుందని తెలుస్తోంది.

"""/" / మరోవైపు టీడీపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగనుందన్న సంగతి తెలిసిందే.

వైసీపీని ఎన్నికల్లో ఢీకొట్టేందుకు బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేయనుంది.ఈ క్రమంలోనే టీడీపీ నిర్వహించిన సర్వేల్లోనూ వైసీపీనే మరోసారి గెలుస్తుందని వెల్లడైంది.

ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.వీటిలో సుమారు 147 నియోజకవర్గాల్లో రెండు శాతం ఓట్లతో వైసీపీ ముందంజలో ఉందని సాక్షాత్తు టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేశ్ వెల్లడించినట్లు సమాచారం.

అంతేకాదు దాదాపు 28 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా కూడా ఏకంగా పది లక్షల ఓట్ల తేడాతో వైసీపీ ముందంజలో ఉందని తెలిపారు.

2014 ఎన్నికల్లో టీడీపీకి 47.07 ఓటింగ్ శాతం రాగా.

వైసీపీకి 45.67 శాతం వచ్చింది.

అంటే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే టీడీపీ విజయం సాధించింది.తరువాత 2019 ఎన్నికల్లో ఓట్ల చీలిక కారణంగానే కేవలం 23 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని టీడీపీ నేత వెల్లడించారు.

"""/" / దీన్ని బట్టి రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు కష్టమని ఆ పార్టీ నేతలకు అర్థం అయిందని తెలుస్తోంది.

పొత్తుతో కలిసి వెళ్లినా వైసీపీ గాలిని తట్టుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న టీడీపీ ఈసారి కూడా జగన్ సర్కార్ ( CM YS JAGAN )వస్తుందని భావిస్తుండటం గమనార్హం.

అయితే అందుకు తగినట్లుగానే ఏపీలో ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.ప్రజల్లో జగన్ పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదు.

సంక్షేమాన్ని గడప ముందుకు తీసుకొచ్చాడన్న భావన అందరిలో ఉందని తెలుస్తోంది.అంతేకాదు విద్య, వైద్యం వంటి పలు రంగాల్లో కీలక సంస్కరణలు తీసుకొచ్చిన జగన్ కు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని చెప్పుకోవచ్చు.

ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడనుందని తేటతెల్లమవుతుందని సమాచారం.

లేడీస్ కోచ్‌లో ప్రయాణిస్తున్న మగవారి చెంపలు పగలగొట్టిన ఆడపోలీసులు.. వీడియో వైరల్..