వైసీపీవి కుటిల రాజకీయాలన్న చంద్రబాబు..!!
TeluguStop.com
టీడీపీ అధికారంలో ఉంటే కడప స్టీల్ ప్లాంట్ పూర్తి అయ్యేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు.
వివేకా హత్య కేసులో దోషులను కాపాడటానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.మొదట గుండెపోటుతో వివేకా చనిపోయారని ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు.
ఆ తర్వాత రక్తపు వాంతులతో చనిపోయారన్నారు.కుటిల రాజకీయాలను వైసీపీ పులివెందుల నుంచే ప్రారంభించిందని విమర్శించారు.
ప్రతిపక్షం వారే వివేకాను హత్య చేశారని ప్రచారం చేశారన్న చంద్రబాబు సీబీఐ ఎస్పీపై కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేశారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే తప్పు చేసిన వారికి శిక్ష పడక తప్పదని వెల్లడించారు.ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, హత్యలు పెరిగిపోయాయని మండిపడ్డారు.