లాక్ డౌన్ ను ఉల్లంఘించిన లోకేశ్,విజయసాయి రెడ్డి ట్వీట్

ఒకపక్క ఏపీ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికే రాజకీయ నేతలు మాత్రం తమ పనులను తాము కానిచ్చేస్తున్నారు.

సోషల్ మీడియా ద్వారా నిత్యం ఒకరిపై నొకరు ఆరోపణలు చేసుకొనే వీరు ఇంతటి ఉపద్రవంలోనూ ఆ విషయాన్నీ మాత్రం మర్చిపోవడం లేదు.

ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య తప్పుగా చెబుతున్నారని,అలానే వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లను అందించడం లో ఏపీ సర్కార్ విఫలమైంది అంటూ టీడీపీ పార్టీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే దీనిపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చారు.ఇలాంటి విపత్తు సమయంలో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తుంది అంటూ వారు మండిపడుతున్నారు.

అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఒక వీడియో ను పోస్ట్ చేసి టీడీపీ పార్టీ పై మండిపడ్డారు.

"""/"/ దేశం మొత్తం లాక్ డౌన్ నిబంధనలు అమలు పరుస్తూ ఇంట్లోనే ఉంటుండగా ఈ మాలోకం మాత్రం లాక్ డౌన్ ను ఉల్లఘించి రోడ్ల పై చక్కర్లు కొడుతున్నాడు అంటూ టీడీపీ అధినేత కుమారుడు,మాజీ మంత్రి లోకేశ్ కు సంబందించిన ఒక వీడియో ను షేర్ చేశారు.

ప్రజలు ఒక వైపు లాక్ డౌన్ తో తీవ్రంగా కష్టపడుతుంటే,బాబు గారి కుమారుడు మాత్రం యథేచ్ఛగా రోడ్లపై చక్కర్లు కొడుతూ కొడుకు దేవాన్ష్ కు స్కేట్ బోర్డు నేర్పిస్తున్నాడు అంటూ దానికి సంబందించిన ఒక వీడియో ను పోస్ట్ చేశారు.

‘‘కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్‌డౌన్‌ను పాటిస్తుంటే చంద్రబాబు సుపుత్రుడు ‘మాలోకం’ మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి యధేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్‌కు స్కేట్‌బోర్డు నేర్పిస్తున్నాడు.

హ్యాట్సాఫ్!’’ అని విజయసాయి వీడియోను పోస్టు చేశారు.దీంతో టీడీపీ అభిమానులు కూడా విజయసాయి రెడ్డికి గట్టిగానే రిప్లై ఇస్తున్నారు.

ఆయన చేసిన ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుసగా ట్వీట్లు పెడుతున్నారు.

మీకులా ఆయన రోజుకో జిల్లా తిరగడం లేదు కదా అని సెటైర్లు వేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు,ఆయన కుమారుడు లోకేశ్ లు హైదరాబాద్ లోనే ఉన్నారని వారు ఒకవేళ ఏపీ కి తిరిగి వస్తే మాత్రం తప్పకుండా క్వారంటైన్ కు తరలిస్తామని వైసీపీ నేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా లోకేశ్ కు సంబందించిన ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ మరోసారి వారిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్…. బ్లాక్ బస్టర్ కావడం పక్కా?