YCP Manifesto : విడుదలకు సిద్ధమవుతున్న వైసీపీ మేనిఫెస్టో .. వీరందరినీ మెప్పిస్తారా ? 

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది.వైసిపి అధినేత,  ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) తాము ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని,  ప్రజల్లో తమకు బలం ఉందని ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగానే ఎదుర్కొంటాము అంటూ ప్రకటనలు చేస్తుండగా,  బిజెపి, టిడిపి ,జనసేన పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి .

దీంతో హోరా హోరీగా ఎన్నికల తంతు ఉండేలా కనిపిస్తోంది.ఇక ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోను ఆయా పార్టీలు సిద్ధం చేసుకున్నాయి.

సూపర్ సిక్స్( TDP Super Six ) పేరుతో ఇప్పటికే టిడిపి మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం,  వైసిపి కూడా 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టోను మించి ఉండేలా కొత్త మేనిఫెస్టో కు రూపకల్పన చేసింది .

ఈనెల 20వ తేదీన స్వయంగా జగన్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా తమ మేనిఫెస్టో ఉండే విధంగా జగన్ జాగ్రత్త పడ్డారు.

"""/"/ అలాగే మహిళలను ఆకట్టుకునే విధంగా కొత్త మేనిఫెస్టోను( YCP Manifesto ) రూపొందించినట్లు సమాచారం.

  ఇప్పటికే వైసీపీ తరఫున పోటీ చేయబోయే 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను జగన్ ప్రకటించారు.

  ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి పూర్తిగా ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు ఉండేలా జగన్ ఏర్పాట్లు చేస్తున్నారు.

2019లో ప్రకటించిన నవరత్నాల ను( YCP Navaratnalu ) అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో అమలు చేసి జగన్ తన చిత్తశుద్ధి ని నిరూపించుకున్నట్లుగా అనేక సందర్భాల్లో చెప్పారు .

"""/"/  ఇప్పుడు నవరత్నాలను మించి ఉండే విధంగా కొత్త మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం .

ముఖ్యంగా రైతులు,  మహిళలు( Women ),  యువత,  నిరుద్యోగులను( Unemployees ) దృష్టిలో ఉంచుకుని కొత్త మేనిఫెస్టోను రూపొందించిన నేపథ్యంలో , దానిని విడుదల చేసిన తర్వాత పూర్తిగా జనాల్లోకి ఆ మేనిఫెస్టోను తీసుకువెళ్లి ఎన్నికల్లో పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.

ఎన్డీఏ కులమతాల మధ్య చిచ్చు పెడుతోంది.. మంత్రి కోమటిరెడ్డి ఫైర్