ఏపీలో మళ్లీ వైసీపీదే విజయం.. సర్వే ఏదైనా ఫ్యాన్దే ప్రభంజనం..!
TeluguStop.com
ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే రాబోతుందా.? అంటే అవుననే సంకేతాలే కన్పిస్తున్నాయి.
పేదలకు సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పరుగులు తీయిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికే ప్రజలు మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
జన్ మత్ పోల్స్ అనే సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది.
సర్వే ప్రకారం వైఎస్ఆర్ సీపీకి 116 నుంచి 118 స్థానాలు వస్తాయని తెలుస్తోంది.
టీడీపీ - జనసేన కూటమికి కేవలం 46 నుంచి 48 సీట్లు దక్కుతాయని సర్వే వెల్లడించింది.
ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ మత్ పోల్స్ సంస్థ నిర్వహించిన పోల్స్ నిజం అయిన సంగతి అందరికీ తెలిసిందే.
దేశంలోనే పేరొందని సర్వే సంస్థలైన టైమ్స్ నౌ గ్రూప్ -ఈటీజీ గ్రూప్ సర్వేల్లోనూ ఏపీలో 51 శాతం ప్రజలు వైఎస్ఆర్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం అయింది.
టైమ్స్ నౌ -ఈటీజీ సంస్థలకు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నో ఎన్నికల్లో సర్వేలు చేసిన అనుభవం ఉంది.
ఈ సంస్థలు వెల్లడించిన పలు సర్వేల అంచనాలకు తగినట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయి.
తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేల్లో వైఎస్ఆర్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడైంది.
అలాగే పొలిటికల్ క్రిటిక్ సర్వేస్ అండ్ అనాలసిస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్ సీపీకి సుమారు 135 స్థానాలు వస్తాయని చెప్పింది.
ఈ క్రమంలోనే పొల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో భాగంగా వైఎస్ఆర్ సీపీకి 48.
5 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది.అలాగే టీడీపీకి 38.
2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.మొత్తం మీద ఏ సర్వేలో అయినా ఏపీలో మరోసారి ఫ్యాన్ గాలి గట్టిగానే వీస్తుందని అర్థం అవుతోంది.
టీడీపీ -జనసేన మరియు బీజేపీ పొత్తులతో వచ్చిన ఫ్యాన్ గాలి ముందు నిలవడం కష్టమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.
ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి విస్తృతంగా చేరాయి.
ఈ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారంతా తిరిగి జగన్ ప్రభుత్వానికే అండగా నిలుస్తారని స్పష్టం అవుతోంది.
దీంతో ఏపీలో మళ్లీ జగనే అధికార పీఠాన్ని అధిరోహిస్తారని తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలో తండేల్ సీన్ రిపీట్.. ఏకంగా అంతమంది జాలర్లను అరెస్ట్ చేశారా?