ఎవరినీ వడలం వడ్డీతో సహా చెల్లిస్తాం .. వైసీపీ హెచ్చరిక

వైసిపి( YCP ) కీలక నాయకులు , ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్ గా ప్రభుత్వం పోలీసుల ద్వారా అనేక కేసులు నమోదు చేయిస్తోంది.

ఇప్పటికే అనేక కేసుల్లో వైసిపి కీలక నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు అరెస్టు కావడం వంటి వ్యవహారాలపై ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్( Former CM Jagan ) ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు.

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు.అడ్డగోలుగా కేసులు పెట్టి,  వైసిపి నాయకులను వేధిస్తూ , అరెస్టు చేయించడం పై జగన్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేసిన అధికారులను సప్తసముద్రాలు దాటినా వదిలిపెట్టమంటూ జగన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

"""/" / ఇక ఈ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కీలక నాయకులు ఈ వ్యవహారాలపై.

స్పందిస్తూ,  ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నారు.  సోషల్ మీడియా కార్యకర్తలపై నమోదు అవుతున్న కేసుల పైన తీవ్రంగా స్పందిస్తున్నారు.

  మాజీ ఎమ్మెల్యే,  జగన్ కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ( Chevireddy Bhaskar Reddy )ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు .

ఎవరి కళ్ళలో ఆనందం కోసం అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారని,  ఎక్కడా లేని సెక్షన్ ల కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని , ఈ విషయంలో అతిగా వ్యవహరిస్తున్న అధికారులను ఎక్కడికి వెళ్లినా వదలమంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హెచ్చరించారు .

"""/" / ఇక మరో కీలక నాయకుడు,  మాజీ మంత్రి కన్నబాబు ( Former Minister Kannababu )సైతం వరుస అరెస్టులపై స్పందించారు.

  వైసిపి నాయకులు,  కార్యకర్తలపై దాడులు చేయడం హేయమైన చర్య అని,  ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు.

ఇప్పటి కంటే ఎక్కువ వడ్డీతో  చెల్లిస్తామంటూ కన్నబాబు వారిని హెచ్చరించారు.ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్స్ విషయంలోనూ గత ప్రభుత్వ హయాంలో టిడిపి నేతలే టార్గెట్ గా చేసిన వేధింపుల వ్యవహారం పైన ప్రస్తుత టిడిపి కూటమి ప్రభుత్వం ఆగ్రహంగానే ఉంది.

ఈ అరెస్టుల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదనే ఆలోచనతో  ఉన్న ప్రభుత్వం ఈ విషయం దూకుడు ప్రదర్శిస్తోంది.

ఇంట్లోనే గోల్డెన్ గ్లో స్కిన్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!