బీజేపీతో కుస్తీకి సై అంటున్న‌ వైసీపీ...? బాబుకు రూట్ క్లియ‌ర్ చేస్తోందా...?

కొద్దిరోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే వైసీపీకి.కేంద్రంలో బీజేపీకి పొస‌గ‌డం లేద‌ని అంటున్నారు రాజ‌కీయ పండితులు.

ఎందుకంటే రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు.రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.

శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది వాస్త‌వం.అందుకు సుదీర్ఘంగా ఏ రెండు పార్టీలు క‌లిసి న‌డ‌వ‌లేవు.

పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం పంతా మార్చుకోవాల్సిందే.ఇప్పుడు అలాగే ఉంది వైసీపీ.

బీజేపీ దోస్తీ.ఇన్ని మూడేళ్లుగా క‌లిసి న‌డిచిన ఈ పార్టీలు ఇప్పుడు వైరం పెంచుకుంటున్నాయి.

ఇటీవ‌ల పార్ల‌మెంట్ లో జ‌రిగిన ప‌రిణామాలు చూస్తుంటే బీజేపీ వైసీపీని సైడ్ చేయాల‌ని భావిస్తోంద‌ని అంటున్నారు.

మ‌రో ప‌క్క టీడీపీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు అనిపిస్తుండ‌టంతో వైసీపీకి అస్స‌లు న‌చ్చ‌డం లేద‌ట‌.

అందుకే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీతో కుస్తీ ప‌డ‌టానికి రెడీ అవుతోంద‌ట‌.వైసీపీ ఈ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్ గా తీసుకుంటోంద‌ట‌.

బీజేపీతో యుద్ధానికి సిద్ధపడేలా ఉంద‌ని అంటున్నారు.ఈ మధ్య జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ కేంద్రంపై గుర్రుగా ఉన్నార‌ట‌.

అన్నింటికీ స‌పోర్ట్ చేస్తే ఇలా చేస్తారా.అని కోపంగా ఉన్నార‌ట‌.

ప్రత్యేకించి బీజేపీ పెద్దల మీద ఆయన మండుతున్నార‌ట‌.కాగా (శ‌నివారం) ఈరోజు ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి జగన్ తో పాటు చంద్రబాబుని కూడా ఆహ్వానించారు.

అది వైసీపీకి అస్స‌లు న‌చ్చ‌డం లేద‌ట‌.దానికి ముందు ఏపీలో జరిగిన అల్లూరి జయంతి వేడుకలకు కూడా బాబుని పిలిచి పెద్ద పీట వేశారు.

ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి టీడీపీ మద్దతు ఇచ్చింది.అతి తక్కువ మంది ఎంపీలు ఉన్నా కూడా టీడీపీకి రాష్ట్రపతి అభ్యర్థిని ప‌రిచ‌యం చేయ‌డానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీసుకెళ్లారు.

"""/"/ టీడీపీ ద‌గ్గ‌ర‌వ్వ‌డం కూడా.అయితే ఇవన్నీ కూడా బీజేపీ టీడీపీ మళ్లీ దోస్తీ క‌ట్ట‌బోతున్నాయ‌ని అంటున్నారు.

పైగా టీడీపీ ఎంపీలు పార్లమెంట్ లో ప్రశ్నలు సంధించడం.దానికి కేంద్ర మంత్రులు జవాబు అంటూ ఏపీ సర్కార్ పరువు తీసేలా అప్పుల చిట్టాను విప్ప‌డం.

పోలవరం పూర్తి కాకపోవడానికి ఏపీలో రైల్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వైసీపీయే కారణమ‌ని చెప్ప‌డంతో వైసీపీ పెద్ద‌లు మండిపోతున్నార‌ట‌.

ఇక ఇప్పటిదాకా ఏపీ సర్కార్ కి అప్పుల విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉండ‌గా ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు భిన్నంగా మారాయి.

"""/"/ యుద్దం చేయ‌డానికి సిద్దం ఇన్నాళ్లు అన్ని విష‌యాల్లో మ‌ద్ద‌తు తెలిపినందుకు బీజేపీ చేసేది ఇదా.

అని అంతర్మథ‌నంలో పడిపోయార‌ట‌.ఇక వైసీపీ కూడా కేంద్రానికి వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించాల‌ని చూస్తోంద‌ట‌.

సరైన టైమ్ లో షాక్ ఇచ్చి పోరాటం చేయడానికి ఏపీ సర్కార్ రెడీ అవుతోందిని అంటున్నారు.

ఇప్పటికే కేంద్రం మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అవుతున్నారు.కేంద్రం కంటే ఏపీలోనే పాలన బాగుందని సెటైర్లు వేస్తున్నారు.

అంతేకాకుండా కేంద్రంలో మోడీ హయాంలో అంతా అప్పుల కుప్ప అని కూడా అన్నారు.

ఇక వైసీపీ నేరుగా కేంద్రంతో యుద్దం చేయ‌డానికే సిద్దం అవుతున్న‌ట్లు తెలుస్తోంది.అందుకు ప‌క్కా ప్లాన్ తో ముందుకు వెళ్తూ కేంద్రాన్ని ఇరికించాల‌నే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌.

ఏపీలో పోలవరం, ఇతర అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడానికి కేంద్రం సహాయ నిరాకరణే కారణం అని చెప్పే అవ‌కాశం ఉంటుంది.

అలాగే ప్రత్యేక హోదా డిమాండ్ తో కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచ‌వ‌చ్చు అని అనుకుంటున్నార‌ట‌.

అలాగే ప్ర‌త్య‌ర్థులు బీజేపీతో దోస్తీ చేసినా వాటికి నెగిటివ్ వ‌చ్చేలా చేయ‌వ‌చ్చ‌నే ప్లాన్ లో ఉన్నార‌ట‌.