అనంతపురం జిల్లాలో వైసీపీ వర్సెస్ టీడీపీ
TeluguStop.com
అనంతపురం జిల్లాలో అధికార పార్టీ వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
దీంతో పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది.ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.
ఈ దాడుల్లో పలువురికి గాయాలు కాగా.నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
దీంతో బాధితులను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
మరోసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జూటురు గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పిగ్మెంటేషన్ మచ్చలు ముఖంపై అసహ్యంగా కనిపిస్తున్నాయా.. ఇలా వదిలించుకోండి!