విశాఖను ఎగ్జిక్యటివ్ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాన పక్షాలైన టీడీపీ సహా ఇతరుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
ఇక్కడి ప్రజలు దీనిని కోరుకోవడం లేదని.విశాఖను వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని కూడా ఈ పార్టీల నాయకులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత వచ్చిన ఎన్నికలే ఇవి కావడంతో ఇక్కడ పార్టీని గెలిపించుకుని.ప్రజలు తమ వైపే ఉన్నారని నిరూపించుకునే అవసరం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
"""/"/
ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ విశాఖ బాధ్యతలను తానే స్వయంగా చూస్తానని ప్రకటించారు.
అయితే సాయిరెడ్డి మాత్రం తనకే వదిలేయాలని.విశాఖను గెలిపించే బాధ్యతను తాను చూస్తానని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖ ఉక్కు కోసం ఆయన పాదయాత్ర కూడా నిర్వహించారు.
ఇక, ఎన్నికల్లో కార్పొరేట్ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు.అంతటితో కూడా ఆగకుండా.
అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.అన్నీతానై ప్రజల మధ్య తిరుగుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల తరహాలో సాయిరెడ్డి ఇక్కడి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. """/"/
అయితే.
టీడీపీ అధినేత చంద్రబాబు సైతం.ఇక్కడి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఆయన రోడ్ షోలు నిర్వహించారు.వరుసగా ఆయన భారీ ఎత్తున ప్రచార సభలు నిర్వహించారు.
ఇది టీడీపీలో మంచి ఊపు తీసుకువచ్చింది.విశాఖలో వైసీపీకి ఎన్ని సానుకూలతలు ఉన్నా.
పార్టీలో అంతర్గత విబేధాలు.కొందరు కార్పొరేటర్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతకు తోడు.
సడెన్‌గా విశాఖ ఉక్కు ఉద్యమం లాంటివి ఎక్కడ దెబ్బకొడతాయో అన్న ఆందోళన ఆ పార్టీ అధిష్టానాన్ని తీవ్రంగా కలవర పెడుతోంది.
ఇదే ఇప్పుడు విజయసాయిని తెగ టెన్షన్ పెట్టేస్తోందట.దీంతో ఇప్పుడు ఎంపీ సాయిరెడ్డి విషయంపై వైసీపీలోనే ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.