లోకేష్ పాదయాత్ర మొదలయితే… మంగళగిరే వైసీపీ టార్గెట్ ? 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసుకుంటున్నారు.

ఈనెల 27వ తేదీ నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు.దాదాపు 400 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ పాదయాత్ర జరుగుతుంది.

అంటే ఎన్నికల వరకు ఈ పాదయాత్రను లోకేష్ నిర్వహిస్తారు.ఇదిలా ఉంటే లోకేష్ పాదయాత్ర కు సంబంధించి వైసీపీ కూడా ఆసక్తి గా గమనిస్తోంది.

లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాగానే ఆయన పోటీ చేయాలని భావిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టిడిపిని మరింత బలహీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఆ పార్టీ వ్యూహం రచిస్తోంది.

2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీచేసి వాటిని పాలయ్యారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు.

దీనిలో భాగంగానే టిడిపిలో ఉన్న గంజి చిరంజీవిని వైసీపీలో చేర్చుకున్నారు.2024 ఎన్నికల్లో గంజి చిరంజీవిని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు .

ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డిని 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేయించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు.

రామకృష్ణారెడ్డి పై వ్యతిరేకత పెరుగుతుండడం,  """/" / గెలుపు కష్టం అనే సర్వే నివేదికలు రావడంతోనే ఆయనను సత్తెనపల్లి కు పంపి గంజి చిరంజీవిని లోకేష్ కు ప్రత్యర్థిగా పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.

ఇక్కడ గెలుపోటములను నిర్దేశించేది చేనేత కార్మికులు కావడం, ఈ నియోజకవర్గంలో పద్మశాలీలు ఎక్కువగా ఉండడంతో, ఆ సమాజ వర్గానికి చెందిన వ్యక్తిని వైసిపి పోటీకి దింపుతుంది.

ఈ నియోజకవర్గంలో లోకేష్ తన పట్టు కోల్పోకుండా అన్న క్యాంటీన్ తో పాటు , సంచార వైద్య వాహనాన్ని తిప్పుతున్నారు.

పార్టీ తరఫున కీలకమైన వ్యక్తులను ఈ నియోజకవర్గంలో మోహరించి టిడిపికి అనుకూలంగా పరిస్థితులను మార్చే విధంగా ప్లాన్ చేశారు.

"""/" / అయితే లోకేష్ పాదయాత్ర మొదలైన తర్వాత ఈ నియోజకవర్గంలో పూర్తిగా ఫోకస్ పెట్టలేరని భావిస్తున్న వైసిపి ఆ సమయంలోనే టిడిపిలో కీలకంగా ఉన్న నాయకులను వైసీపీలో చేర్చుకునే పనికి శ్రీకారం చుట్టాలని, క్రమ క్రమంగా ఇక్కడ లోకేష్ కు ఇబ్బందికర పరిస్థితులను సృష్టించి,  2024 ఎన్నికల్లో వైసీపీ జెండా మళ్లీ నియోజకవర్గంలో ఎగరవేయాలని, లోకేష్ ను మళ్లీ ఓడించడం ద్వారా ఆయన ప్రభావాన్ని మరింత తగ్గించేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోంది.

వీడియో: రీల్స్ కోసం బైక్ స్టంట్స్ చేశాడు.. కింద పడటంతో మృతి..?