అక్కడ వైసీపీలో సీన్ రివర్స్.. ఏం జరిగిందంటే ! TeluguStop.com
వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీకాకుళం జిల్లాలో ఆశించిన మేరకు ఫలితం దక్కడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఎందు కంటే.ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో అడుగడుగునా.
వైసీపీకి ఎదురీతే ఎదురవుతోంది.తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడలో గెలుపు గుర్రం ఎక్కి టీడీపీకి ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు షాకివ్వాలని వైసీపీ నిర్ణయించుకుంది.
ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ రెచ్చిపోయారు.అయినప్పటికీ.
నిమ్మాడను దక్కించుకోలేక పోయారు.ఇక, తొలిదశంలో టీడీపీకి పంచాయతీలను తగ్గించినా.
వైసీపీ కి మాత్రం ఆశించిన మేరకు పంచాయతీలు దక్కలేదనేది వాస్తవం.ఇక, ఇప్పుడు రెండో దశకు శ్రీకాకుళం రెడీ అయింంది.
ఇక్కడ రెండో దశలో మొత్తం 236 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగ నున్నాయి.
అదేవిధంగా 1448 వార్డులకు కూడా రెండో దశలో పార్టీల భవితవ్యం తేలిపోనుంది.అయితే.
వీటిలో చిత్రం ఏంటంటే.కీలక నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడమే.
జిల్లాలోని ఇచ్ఛాపురం, కంచిలి,కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస, రాజాం, సంతకవిటి మండలాల్లోని 279 పంచాయతీలు ఉన్నాయి.
అయితే.వీటిలో వీటిలో కేవలం 41 పంచాయతీలు మాత్రమే రెండో దశలో ఏకగ్రీవం కావడం గమనార్హం.
ఫలితంగా మిగిలిన 236 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. """/"/
అదేవిధంగా మొత్తం 2716 వార్డులు ఉండగా.
వీటిలో ఒకింత ఫర్వాలేదు అనే విధంగా 1239 వార్డులు ఏకగ్రీవాలు అయ్యాయి.అయితే వీటిలోనూ సగానికిపైగా టీడీపీ దక్కించుకుంది.
ఇది వైసీపీకి రుచించడం లేదు.జిల్లా రాజకీయాలు పరిశీలిస్తే.
కీలకమైన వైసీపీ నాయకులు ఇక్కడే పాగా వేసి మరీ ఎన్నికల సరళిని ముందు నుంచి శాసిస్తున్నారనే వాదన ఉంది.
దీనిపై అచ్చెన్నాయుడు అనేక మార్లు ఫైరయ్యారు కూడా.స్పీకర్ తమ్మినేని సీతారాం.
మంత్రి సీదిరి అప్పలరాజులకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయనే టాక్ ఒకవైపు వినిపిస్తుండగా.
టీడీపీ వారు వీరిపై విమర్శలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల మాదిరిగా.
ఇక్కడ కూడా వైసీపీ దూకుడు ఉంటుందని భావించారు.కానీ, అలా లేకపోవడంతో వైసీపీ అధిష్టానం సీరియస్‌గా ఉందనే వార్తలు వస్తున్నాయి.
మరి ఎవరిని టార్గెట్ చేస్తారో చూడాలి.