రెడీ అంటున్న వైసీపీ.. భయపడుతున్న టీడీపీ ?

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ( Chandrababu Arrest )ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే.

చంద్రబాబుపై కక్ష పూరితంగా అక్రమ కేసులు పెట్టారని, జగన్ సర్కార్ పెట్టిన ప్రతి కేసుకు ఎలాంటి ఆధారాలు టీడీపీ శ్రేణులు ఘంటాపథంగా పరోపిస్తున్నారు.

దీనిపై ప్రభుత్వాని నిలదీసేందుకు అసెంబ్లీ వేధికగా మార్చుకున్నారు టీడీపీ శ్రేణులు.గత కొన్ని రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ పెద్దగా యాక్టివ్ గా లేదు.

అధినేత చంద్రబాబు అసెంబ్లీకి రానని శపథం చేసిన తరువాత.టీడీపీ ఎమ్మేల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో మునుపటి జోష్ చూపించడం లేదు.

తాజాగా జరుగుతున్నా అసెంబ్లీ సమావేశాలను మాత్రం టీడీపీ( TDP ) సీరియస్ గా తీసుకుంది.

"""/" / ఈ అసెంబ్లీ సమావేహల్లో చంద్రబాబు అరెస్ట్ అంశంపై చర్చ జరిగేలా టీడీపీ( TDP ) శ్రేణులు ప్రణాళిక వేశారు.

అనుకున్నట్లుగానే నేడు ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరిపాలని టీడీపీ ఎమ్మేల్యేలు గట్టిగా డిమాండ్ చేస్తూ సభలో గందరగోళ పరిస్థితులకు తెరతీశారు.

అయితే ఊహించని రీతిలో చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రభుత నేతలు చెప్పడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయం.

కానీ చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని వైసీపీ క్లారిటీ ఇచ్చినప్పటికి టీడీపీ శ్రేణులు మాత్రం చర్చకు సంబంధించి ప్రాపర్ ఫార్మాట్ ను ఇవ్వకుండా గందరగోళ పరిస్థితులను అలాగే కొనసాగిస్తూ వచ్చారు.

"""/" / ఫలితంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.అయితే ప్రభుత్వం చర్చకు సిద్దమని స్పష్టం చేసినప్పటికీ టీడీపీ ఎందుకు వెనుకడుగు వేసిందనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.

చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని వైసీపీ నేతలు ( YCP )మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్నారు.

అందుకే అరెస్ట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగానే ఉందనేది వైసీపీ సానుభూతి పరులు చెబుతున్నా మాట.

కానీ అక్రమ కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేశారని భావిచ్చినప్పుడు, చర్చ జరపాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యేలే సిద్దంగా లేకపోవడం కొత్త అనుమానాలకు తెర తీస్తోంది.

మొత్తానికి నేడు ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో అసలు విషయం తేలకుండానే వాయిదా పడ్డాయనే చెప్పాలి.

ప్రశాంత్ నీల్, ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్లు ఎంతో మీకు తెలుసా.. భారీగానే తీసుకుంటున్నారుగా!