వైసీపీ సామాజిక సాధికార యాత్ర రూట్ మ్యాప్ ఇలా ! కలిసొస్తుందా లేదా ?

ఏపీ అధికార పార్టీ వైసిపి( YCP ) రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ఎన్నికల కసరత్తు మొదలు పెట్టేసింది.

వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రజలకు ఎంత మేలు జరిగింది,   ఏ సామాజిక వర్గాలకు ఏ స్థాయిలో మేలు చేసింది అనే విషయాలను ప్రజలకు వివరించే పనిలో నిమగ్నం అయింది .

ముఖ్యంగా తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనారిటీలకు కలిగిన ప్రయోజనాన్ని, గత టిడిపి ప్రభుత్వంలో అందిన సాయం , ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సహాయం గురించి వివరించే ప్రయత్నం చేస్తుంది.

దీనిలో భాగంగానే సామాజిక సాధికార యాత్ర( Samajika Sadhikara Yatra ) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, అధికారులు ఇతర కీలక నేతలు అంతా హాజరయ్యే విధంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.

  ఇప్పటికే ఈ యాత్ర మొదటి విడత పూర్తికాగా , రెండో విడతను మొదలుపెట్టింది.

ఈ యాత్ర ద్వారా ప్రజల్లో పెద్దగా ప్రభావం కనిపించకపోయినా,  వైసీపీ నాయకుల్లో మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది.

పార్టీ కీలక నేతలంతా ఈ యాత్రలో పాల్గొంటూ తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ, ప్రజలను ఆకట్టుకునే విధంగా చేస్తున్న ప్రసంగాలు మంచి బూస్ట్ ఇస్తున్నాయి.

ఇదిలా ఉంటే వైసీపీ సామాజిక సాధికార యాత్ర 15వ రోజుకు చేరుకుంది.ఈ యాత్ర నేడు విజయనగరం కోనసీమ జిల్లాలో జరగనుంది.

 విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యే కంబాల జోగులు( MLA Kambala Jogulu ) ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.

ఇక కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి( MLA Chirla Jaggireddy ) ఆధ్వర్యంలో యాత్ర కొనసాగునుంది.

"""/" / H3 Class=subheader-styleవిజయనగరం జిల్లా రాజాం లో ఈ విధంగా./h3p రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో బస్సుయాత్ర ప్రారంభమవుతుంది.

ఉదయం 11:30 గంటలకు బద్దంలో నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తారు .మధ్యాహ్నం 12 గంటలకు వైసీపీ నేతలు( YCP Leaders ) ప్రెస్ మీట్ నిర్వహిస్తారు .

మధ్యాహ్నం 12:30 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది .భోజనం విరామం తర్వాత పాలకొండ రోడ్డులోని జేజే ఇన్ఫోటెల్ వరకు ర్యాలీ బస్సు యాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. """/" / H3 Class=subheader-styleకొత్తపేటలో ఈ విధంగా/h3p కోనసీమ జిల్లా కొత్తపేటలో( Kothapeta ) ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.

 మధ్యాహ్నం ఒంటిగంటకు రావులపాలెంలో వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహిస్తారు .మధ్యాహ్నం రెండు గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది.

8 కిలోమీటర్లు మేరకు బస్సు యాత్ర కొనసాగుతుంది.సాయంత్రం నాలుగు గంటలకు కొత్తపేట సెంటర్ లో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

వారి అండతో దుబాయిలో దాక్కున్న హర్ష సాయి..?