ఏపీలో వైసీపీ పాలన అంతమవడం ఖాయం..: పవన్ కల్యాణ్
TeluguStop.com
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి సభ జరుగుతోంది.
ఏపీలో టీడీపీ, బీజేపీ మరియు జనసేన పొత్తు తరువాత నిర్వహిస్తున్న తొలి సభ ఇదే కావడం విశేషం.
ఈ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్డీఏ పునర్ కలయిక ఐదు కోట్ల ప్రజలకు ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని తెలిపారు.ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్పష్టం చేశారు.
తమ కూటమికి దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నాయన్న జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలో వైసీపీ పాలన అంతం కాబోతోందని తెలిపారు.
చిరంజీవి సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న శ్రీకాంత్ ఓదెల…మరి ఇది వర్కౌట్ అవుతుందా..?