వైసిపి రిపేర్ మోడ్- ఫలితమిస్తుందా?

ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసిపి రిపేర్ మోడ్ లోకి వెళ్లిపోయింది.

ముఖ్యంగా ప్రజాధరణ విషయంలో వెనుకబడిన నేతలను మార్చే దిశగా ప్రణాళికలు రచిస్తుంది.

ఇప్పటికే 11 చోట్ల ఇన్చార్జి లను మార్చిన వైసిపి, కనీసం 50 నుంచి 60 స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతుందని వార్తలు వస్తున్నాయి.

దాంతో తమ భవితవ్యం ఏమిటో తెలియక వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన పడుతున్నారట.

అయితే గత కొన్ని రోజులగా ఒక ప్రణాళిక ప్రకారం తమ పనితీరుపై సమాచారం ఇస్తూ ఉన్నారు కనుక ఇప్పటికే ఆయా నేతలకు తమ రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ వచ్చేసిందని, అయితే చివరి నిమిషం లో ఏదైనా అద్భుతం జరుగుతుంది అన్న ఆశలతోనే పార్టీలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది.

దానికి తోడు తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తూ ఉండటంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలలో కూడా సీటు కేటాయింపు పై స్పష్టమైన హామీ దక్కే అవకాశం లేకపోవడంతో చాలామంది ఈసారి రాజకీయ నిరుద్యోగులు గా మారిపోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది .

అయితే వైసిపి చేస్తున్న రిపేర్ లపై ప్రతిపక్షాలు కూడా తమదైన శైలిలో సెటైర్లు వేస్తూ ఉన్నాయి.

వైసిపి మునిగిపోయే నావ అని దానికి ఎన్ని రిపేర్లు చేసినా అది గమ్యం చేరదంటూ తెలుగుదేశం జనసేన నేతలు వైసిపి పై ఎదురుదాడి చేస్తున్నారు.

"""/" / అయితే వైసీపీ అధినేత జగన్ పూర్తిస్థాయి ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళుతున్నట్లుగా కనిపిస్తుంది.

తనకి ఎంత సన్నిహితులైనా కూడా ప్రజాదరణ విషయంలో సర్వేలనే నమ్ముకుంటున్న జగన్, వారు ప్రజల మనసును గెలుచుకున్నారని నమ్మితేనే మరోసారి టికెట్ ఇచ్చేటట్టుగా కనిపిస్తున్నారు.

అయితే టికెట్ దక్కని వారికి పార్టీ పదవులలో కానీ కార్పొరేషన్లో కానీ కేటాయింపులు ఉంటాయని నిరుత్సాహ పడవద్దు అని హామీ ఇస్తున్నారట.

అయినప్పటికీ కొంతమంది తాము గెలుస్తాము అన్న నమ్మకం తో ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై3, బుధవారం2024