నాలుగో జాబితా విడుదల చేసిన వైసీపీ..!!
TeluguStop.com
వైసీపీ( YCP ) పార్టీ వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.
ఆ పార్టీ అధినేత సీఎం జగన్( CM Jagan ) పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో.సర్వేలు చేయించుకుని వాటి ఫలితాలు ఆధారంగా ఎంపిక చేస్తున్నారు.
సర్వేలో వచ్చిన ఫలితాలు బట్టి స్థాన చలనం లేదా ఇన్చార్జిల మార్పు చేస్తూ ఉన్నారు.
ఎలాంటి మొహమాటానికి పోకుండా ప్రజా వ్యతిరేక కలిగిన సిట్టింగ్ లకి టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు.
"""/" /
ఈ రకంగా మొదటి జాబితాలో 11 మంది రెండవ జాబితాలో 25 మంది మూడవ జాబితాలో 27 మంది అభ్యర్థుల పేర్లను విడుదల చేయడం జరిగింది.
చివరగా నాలుగో జాబితా( Fourth List ) నేడు రిలీజ్ చేయడం జరిగింది.
ఈ నాలుగో జాబితాలో ఒక ఎంపీ, 8 ఎమ్మెల్యే స్థానాలకు కొత్త ఇన్చార్జిలను వైసీపీ ప్రకటించింది.
ఐదుగురు సిట్టింగులు తిప్పేస్వామి(మడకశిర),( Thippeswamy ) పద్మావతి (సింగనమల), బుర్రా మధుసూదన్ యాదవ్(కనిగిరి), రక్షణనిధి (తిరువూరు), """/" /
ఆర్థర్ (నందికొట్కూరు) కు( Arthur ) స్థానం దక్కలేదు.
చిత్తూరు ఎంపీ రెడ్డప్ప,( MP Reddappa ) జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామి, గోపాలపురం, కొవ్వూరు ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, తానేటి వనితకు( Taneti Vanitha ) స్థానచలనం కలిగించింది.
ఇదే తుది జాబితా అని సమాచారం.దీంతో మొత్తం మీద ఇన్చార్జిల మార్పు స్థాన చలనం కింద నాలుగు జాబితాలలో కలిపి 50కి పైగా అభ్యర్థుల మార్పు వైసీపీ చేయడం జరిగింది.
ఇక జనవరి 25వ తారీకు నుండి జిల్లాల సమావేశాలలో వైయస్ జగన్ పాల్గొనడానికి రెడీ అవుతున్నారు.
కొరియన్ స్టార్ హృదయంలో నిలిచిన భారతీయ అభిమాని.. దశాబ్దం తర్వాత గుర్తుపట్టాడు..?