ఏపీలో ఎల్లుండి నుంచి వైసీపీ ఎన్నికల శంఖారావం..!!
TeluguStop.com
ఏపీలో ఎల్లుండి నుంచి వైసీపీ ( YCP )ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రీజనల్ ఏరియాల్లో క్యాడర్ మీటింగ్స్ తో పాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు.
అయితే ఈ క్యాడర్ మీటింగ్స్ కు ‘ సిద్ధం’ అనే పేరును వైసీపీ అధిష్టానం నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఎల్లుండి భీమిలిలో సీఎం జగన్( Cm Jagan ) మొదటి క్యాడర్ మీటింగ్ ను నిర్వహించనున్నారు.
"""/" / ఈ క్రమంలో సీఎం సభకు వైసీపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే సభ కోసం మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
సభను విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్ ఈ సందర్బంగా పిలుపునిచ్చారు.భీమిలి సభ( Bhimili Sabha ) అనంతరం 30వ తేదీన ఏలూరులో, ఫిబ్రవరి 3న అనంతపురంలో క్యాడర్ మీటింగ్ లు జరగనున్నాయి.
ఇంకా మిగిలిన రెండు సమావేశాలకు వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.