రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే అధికారం...?

ఏపీ సీఎం జగన్ పాలనా పగ్గాలు చేపట్టి మూడేళ్లు అవుతోంది.ఈ మూడేళ్ళ కాలంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు సీఎం జగన్.

మరెన్నో ప్రశంసలు అందుకున్నారు.పాలన లో జగన్ ఫెయిల్ అయ్యాడు అంటోంది ప్రతిపక్షం .

ఎన్నికల హామీలన్నీ నెరవేర్చి.ప్రజల మెప్పు పొందుతున్నాం అంటున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఏదో గాలి వాటంగా అధికారంలోకి రాలేదు.అధికారం కోసం ప‌దేళ్ల‌కు పైగా ఎదురుచూశాడు.

త‌న సమయం వ‌చ్చాక‌.ప్ర‌జ‌లు ఆద‌రించాక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు.

ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఆయన అలుపెరగని బాటసారిగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు మూడు వేలకు కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూశాడు ముఖ్యమంత్రి జగన్.

వారి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చాడు.నేనున్నా అంటూ భరోసా ఇచ్చాడు.

అయితే గత ఎన్నికల్లో ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలను గెలిపించుకుని మరో చరిత్ర సృష్టించాడు.

ఈ మూడేళ్ళ పాలనలో ఎన్నో సమస్యలు, విపక్షాల ఆరోపణలు.వివాదాలు, సంక్షోభాలు ఎదురైనా మొక్కవోని పట్టుదలతో చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఎన్నికల వైపు దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

"""/"/ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొచ్చి మూడేళ్లు అవుతోంది.ఈ మూడేళ్ల జగన్ పాలన పై ఎన్నో విమర్శలు ఉన్నాయి.

అదే స్థాయిలో కాకపోయినా ప్రశంసలు కూడా లేకపోలేదు.వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు, జగన్ అభిమానులు, పార్టీ అభిమానులు ఆనందోత్సాహాలతో జగన్ ప్రమాణ స్వీకారాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాలో జగన్ ఫొటోలు పెడుతూ ఈ మూడేళ్లలో జ‌గ‌న్ చేసిన ప‌నుల‌ను పేర్కొంటూ హల్చల్ చేస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో కూడా తమదే అధికారం అంటున్నారు.

కళ్లముందే నరకం: కార్చిచ్చులో చిక్కుకున్న స్నేహితులు.. భయానక వీడియో వైరల్..