ఉత్తరాంధ్ర టూ కోస్తా ఆంధ్ర : ‘కాపు ‘ కాసేవారు ఈ ఇద్దరేనా ?

  ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు వేసే ఎత్తుగడలు ఆషామాషీగా ఉండవు.కుల లెక్కల ఆధారంగా సీట్ల కేటాయింపు చేయడంతో పాటు,  ఆయా సామాజిక వర్గాల్లో కీలక వ్యక్తులు ఎవరోగుర్తించి వారి ద్వారా తమ పార్టీకి ఏ స్థాయిలో మేలు జరుగుతుంది అనేది స్పష్టంగా అంచనా వేసి వారిని అనేక రకాలుగా ఒప్పించి పార్టీలో చేర్చుకుని వారి ద్వారా తమ అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ఆయా రాజకీయ పార్టీల అధిష్టానాలు ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాయి.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, అనేక రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల అధినేతలు రంగంలోకి దిగిపోయారు .

ఎన్నికలు అప్పుడే వచ్చేశాయా అన్నట్లుగా ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో టిడిపి, జనసేన, వైసీపీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.

ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో గెలుపు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మక కావడంతో టిడిపి, వైసిపి, జనసేన బిజెపిలు ఏపీ లో బలంగా ఉన్న సామాజిక వర్గాలను టార్గెట్ చేసే పనిలో పడ్డాయి.

ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసిపి ఈ విషయంలో అలర్ట్ గా ఉంటోది .

ఒకవైపు టిడిపి తో పాటు, మరోవైపు జనసేన  తమను టార్గెట్ చేసుకుని తమను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో, ఏపీలో ప్రధానంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓటర్లను తమ చేజారి పోకుండా చూసుకునే పనిలో అధికార పార్టీ వైసిపి ఉంది.

        దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల్లో ప్రధానంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు వైసిపికి ఎక్కువ పడే విధంగా ఇప్పటి నుంచే ఆ పార్టీ దృష్టి సారించింది.

దీనిలో భాగంగానే మాజీ మంత్రి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నేతగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు ను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి.

తాను వైసీపీలో చేరేందుకు అనేక షరతులు విధించడం, ఎన్నికల సమయంలో తమ వర్గం వారికి ఎక్కువ సీట్లను కేటాయించాలనే షరతులు విధించడంతో మొన్నటివరకు ఆయనను పక్కన పెట్టిన వైసిపి ఇప్పుడు మాత్రం ఆయన కోరికలన్ని తీర్చి తగిన ప్రాధాన్యం ఇస్తామని  హామీ ఇచ్చినట్లు సమాచారం.

డిసెంబర్ ఒకటో తేదీన గంట వైసీపీలో చేరబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.      """/"/  అలాగే కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా గుర్తింపు పొందిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ను వైసిపిలో చేర్చుకునే కార్యక్రమం సక్సెస్ అయ్యిందట.

వైసీపీలో చేరితే ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ తో పాటు ముద్రగడకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

మొత్తంగా కాపు సామాజిక వర్గం ఓట్లు అటు టిడిపి , ఇటు జనసేన వైపునకు వెళ్లకుండా ముద్రగడ తో పాటు భారీగా కాపు నేతలను పార్టీలో చేర్చుకుని వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు వైసిపి సిద్ధమయ్యింది.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటా, కోస్తాంధ్రలో ముద్రగడ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అని దీని ద్వారా జనసేన ప్రభావాన్ని తగ్గించవచ్చని జగన్ అభిప్రాయపడుతున్నారట.

 .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, గురువారం 2024