పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర – పవన్ కళ్యాణ్

కృష్ణా జిల్లా: రేపటి పెడన సభపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.పెడన సభలో రాళ్ల దాడికి ప్రభుత్వం కుట్ర.

రేపు పెడన సభను అడ్డుకునేందుకు క్రిమినల్స్ ను దింపారనే సమాచారం మాకు ఉంది.

పబ్లిక్ మీటింగ్ లో రాళ్ళ దాడి చేసి గొడవ చేయాలని ప్లాన్ చేశారంటున్నారు.

మా పెడన సభలో గొడవలు సృష్టిస్తే.మేము సహించం.

సీఎం, డీజీపీ, ఇతర అధికారులు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలి.తెదేపా, జనసేన పొత్తును విచ్చిన్నం చేయాలని కుట్ర చేస్తున్నారు.

రాళ్ల దాడి జరిగినా, క్రిమినల్స్ ఎటాక్ చేసినా.ప్రభుత్వం, డీజీపీలదే బాధ్యత.

జిల్లా ఎస్పీలు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి.ముఖ్యంగా జగన్ కు చెబుతున్నాం.

మీరు పులివెందుల రౌడీయిజం చేస్తే.మేము చూస్తూ ఊరుకోం.

దాడులు చేస్తే.జనసేన సైనికులు ఎదురు దాడి దిగకండి.

ఎవరు అనుమానంగా ఉన్నా.జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా.

వారిని పట్టుకోండి.వాళ్లను పోలీసులకు మనమే తీసుకెళ్లి అప్పగించండి.

రెండు, మూడు వేల మంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉంది.మన సంఖ్యా బలం చాలా ఎక్కువ.

వారిపై దాడి చేయకండి.పట్టుకోండి.

జగన్ ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే.భవిష్యత్ లో చాలా దారుణంగా ఉంటుంది గుర్తు పెట్టుకో.

ఓరి దేవుడా.. కళ్ళు సీసాలో ప్రత్యక్షమైన కట్లపాము