నాయకుడు అలా నాయకులు ఇలా ! వైసీపీలో ఏంటో ఈ గందరగోళం

అధికారం చేపట్టిన దగ్గర నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెబుతున్న మాట అవినీతిరహిత పాలన.

తన పరిపాలన గురించి జనం పదికాలాలపాటు చెప్పుకోవాలని జగన్ భావిస్తూ పార్టీ నాయకులను సైతం కొంచెం దూరం పెట్టి అధికారులకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

సాక్షాత్తు సీఎం ఈ విధంగా చెప్పడంతో అధికారులు కూడా ఆ విధంగానే ముందుకు దూసుకువెళ్తున్నారు.

అవినీతి రహిత సమాజం కోసం ఏకంగా జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పనులన్నింటిలో పారదర్శకత పెంచారు.

ఇక పైరవీలు, లంచాలకు సచివాలయంలో తావులేకుండా చేశారు.మంత్రులకు కూడా ఈ విషయంలో గట్టి వార్నింగ్ లే అందాయి.

మొత్తం ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి ప్రజల నుంచి, మీడియా నుంచి మంచి మార్కులే పడ్డాయి.

"""/"/ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.జగన్ పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుందనుకుంటున్న సమయంలో పార్టీ నాయకులు ఆ ఆనందాన్ని ఎంతో కాలం నిలిచేలా కనిపించడంలేదు.

నాయకుల వ్యవహారశైలి తో జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన క్రెడిట్ ను గంగపాలు చేస్తోంది.

జగన్ పరువు తీసేలా కొంత నేతలు లంచాలు, అవినీతికి పాల్పడుతూ ఆరోపణలు తెచ్చుకుంటూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా కనిపిస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే తన పుట్టినరోజు కోసం సుమారు కోటి రూపాయలు వసూలు చేసిన సంఘటన వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఇసుక మైనింగ్ లో ఇద్దరు ప్రజాప్రతినిధులు వాడుకున్న ప్రచారం వైసీపీకి చెడ్డపేరు తీసుకొస్తోంది.

పార్టీ కోసం ఇప్పటివరకు ఎంతో ఖర్చుపెట్టామని తిరిగి రాబట్టుకోకపోతే ఎలా అనే ఉద్దేశంలో చాలామంది నాయకులు ఉన్నారు.

అందుకే ఇప్పడు వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు, మంత్రుల్లో కొందరు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

జగన్ ఎంత అవినీతి రహిత, పారదర్శకత పాలన కోసం పాటుపడుతున్నా క్షేత్రస్థాయిలోని నేతలు మాత్రం జగన్ బాటలో వెళ్లకపోవడంతో ఆయన అనుకున్న సిద్ధాంతానికి తూట్లు పడుతున్నాయి.

ఇప్పటికే ఇటువంటి వ్యవహారాలు జగన్ చెవిన కూడా పడడంతో అటువంటి నేతలందరినీ పిలిచి గట్టిగా వార్ణింగ్ ఇవ్వాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడట.

అయితే ఈ వ్యవహారాలు బయటికి పొక్కకుండా జగన్ జాగ్రత్తపడుతున్నాడట.

మళ్లీ జనంలోకి ఏపీ సీఎం జగన్..!