యువగళం లోకేష్ ఫ్లెక్సిలు ఏర్పాటు చేద్దాం అనుకున్న తెలుగు తమ్ముళ్ళ కు నిరాశ..

వినుకొండ:- పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అధికారిక హోర్డింగ్స్ పై రాత్రికి రాత్రి అభివృద్ధి పథంలో వినుకొండ నియోజకవర్గం అంటూ వైసిపి అధికారంలోకి వచ్చి, శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు యంయల్ఏ గా పని చేసిన నాలుగు సంవత్సరాల్లో నియోజకవర్గంలో జరిగిన, జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియపరుస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సి లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.

H3 Class=subheader-styleనిరాశ లో తెలుగు తమ్ముళ్ళు.???/h3p తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నియోజకవర్గంలో అడుగుపెట్టింది.

రెండవ రోజు పట్టణంలో పాదయాత్ర,అనంతరం బహిరంగసభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నారా లోకేష్ ఫ్లెక్సి లు ప్రధాన హోర్డింగ్స్ పై ఏర్పాటు చేద్దాం అనుకున్న కొందరు తెలుగు తమ్ముళ్ళకు అభివృద్ధి పథంలో వినుకొండ నియోజకవర్గం ఫ్లెక్సి లు చూసే సరికి నిరాశ ఎదురైందని బాటసారులు అనుకుంటున్నారు.

దేవర విషయంలో నెలకొన్న గందరగోళం.. ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే అలా చేయాల్సిందే!