ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ నామినేషన్లు..!

ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, నామినేషన్లు దాఖలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ మేరకు అధికార వైసీపీ ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు వేశామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

త్వరలో గవర్నర్ కోటాలో రెండు స్థానాలు భర్తీ చేయనున్నామని పేర్కొన్నారు.ఖాళీ అయిన, అవుతున్న 18 స్థానాల్లో 14 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించామని సజ్జల వెల్లడించారు.

పదవుల కేటాయింపులో సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారన్నారు.జగన్ విప్లవాత్మక నిర్ణయంతో ప్రజల మన్నన పొందుతున్నామని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తామని సజ్జల స్పష్టం చేశారు.

గ్రీన్ టీ బరువునే కాదు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.. ఎలా వాడాలంటే?