కొత్త న్యూస్ ఛానల్ ప్రారంభిస్తున్న వైసిపి విజయసాయిరెడ్డి

వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై( Vijayasai Reddy ) గత కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా విజయ సాయి రెడ్డి వివాహేతర సంబంధం ఆరోపణలపై రాజ్యసభలోనూ చర్చిని అంశంగా మారింది.

  ఈ వ్యవహారంపై విజయసాయిరెడ్డి తాజాగా స్పందించారు.ఈ సందర్భంగా తాను ఓ కొత్త న్యూస్ ఛానల్( News Channel ) ప్రారంభించబోతున్నట్లు విజయ సాయి రెడ్డి ప్రకటించారు.

ఈ సందర్భంగా అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'' నేను లేని సమయంలో నా ఇంటికి వచ్చి ఎవరో బెదిరించారు.

  తాటాకు చప్పుళ్ళకు భయపడే వ్యక్తి విజయ సాయి రెడ్డి కాదు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే వ్యక్తిని కాను.

నా పేరు ప్రతిష్టలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.  మళ్లీ ఐదేళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ( YSRCP ) అధికారంలోకి వస్తుంది.

  మధ్యంతర ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.  ఎవరైతే ఇప్పుడు తోక ఆడిస్తున్నారో త్వరలోనే వాటిని కత్తిరిస్తా  వైసిపికి సహకరించిన వారిని ఇబ్బందులు పెడుతున్నారు.

  వైసీపీకి మద్దతు ఇచ్చిన కుటుంబాలు గ్రామాలు వదిలిపెట్టి పోతున్నాయి.  నెలరోజుల పాలనను ప్రజలు గమనిస్తున్నారు '' అంటూ విజయ సాయి రెడ్డి వ్యాఖనించారు.

"""/" / '' వైసీపీ నేతలపై బురద చల్లుతున్నారు.  చివరకు మా పార్టీ వాళ్లు కూడా టిడిపి( TDP ) వాళ్ళతో కొమ్మక్కై నాపై అనేక ఆరోపణలు చేశారు.

  నా వ్యక్తిత్వం ఏంటి అన్న విషయం నాకు తెలుసు.  రామోజీరావు( Ramojirao ) లాంటి వ్యక్తులను సైతం ఎదిరించాను.

సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి నాపై అనేక ఆరోపణలు చేస్తున్నారు.

వారిని వదిలిపెట్టను చట్టరీత్య చర్యలు తీసుకుంటాను '' అంటూ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.'' త్వరలోనే నేను కొత్త ఛానల్ ప్రారంభిస్తున్న గతంలో మా అధ్యక్షులు నిర్ణయం మేరకు ఛానల్ ప్రారంభాన్ని వెనక్కి తీసుకున్నా.

ఇప్పుడు ఎవరు చెప్పినా తగ్గేది లేదు.కుల చానల్స్ , కుల పత్రికలను ఎండగడతాను కులాలను మతాలకు అతీతంగా మా ఛానల్ ఉంటుంది ఒక పార్టీకి మాత్రమే పనిచేయడం కాకుండా న్యూట్రల్ గా ఉంటుంది '' అన్నారు.

"""/" / '' పథకం ప్రకారం నాపై కుట్ర జరుగుతోంది.సహాయం కోసం అధికారి శాంతి( Shanti ) నన్ను కలిసినంత మాత్రాన అక్రమ సంబంధం అంటగడతారా ?  నిజా నిజాలు తెలుసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు నాపై వార్తలు రాస్తున్నారు.

  మా పార్టీకి చెందిన కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.మహిళకు ద్రోహం చేశానని దుష్ప్రచారం చేస్తున్నారు.

  నా పేరు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు.దుష్ప్రచారం చేస్తున్నవారు ఎంతటి వారైనా వదిలిపెట్టం దుష్ప్రచారం చేస్తున్నవారు మా పార్టీ వాళ్ళైనా వదలను .

చట్ట పరంగా ముందుకు వెళతాం .మహిళా కమిషన్ సహా అన్ని కమిషన్లకు ఫిర్యాదు చేస్తాం ఎవరిని వదిలే ప్రసక్తి లేదు '' అంటూ విజయ సాయి రెడ్డి హెచ్చరించారు.

నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!