హైకోర్టులో ఊరట… సంక్రాంతికి సొంత నియోజకవర్గానికి రాబోతున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు..!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు( YCP MP Raghu Rama Krishna Raju ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

2019 ఎన్నికలలో నరసాపురం నియోజకవర్గం ఎంపీగా గెలిచిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీకి దూరంగా ఉంటూ.

నియోజకవర్గంలో కూడా రాని పరిస్థితి నెలకొంది.ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి.

ఒకసారి అరెస్టు కూడా కావటం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా.

సొంత ఊరు వెళ్ళటానికి హైకోర్టులో రఘురామకృష్ణ రాజు పిటిషన్ వేయడం జరిగింది.సంక్రాంతికి ఊరు వెళ్తానని రక్షణ కల్పించాలని.

ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది.ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం 41A ప్రొసీజర్ ఫాలో అవుతూ ఎంపీకి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో హైకోర్టులో ఊరట లభించడంతో సంక్రాంతికి ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టబోతున్నారు.

చాలాకాలం తర్వాత నియోజకవర్గంలో వస్తూ ఉండటంతో.రఘురామకృష్ణరాజు అనుచరలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉంది.

పరిస్థితి ఇలా ఉండ రఘురామకృష్ణ రాజు రాష్ట్రంలో లేకపోయినా గాని ఢిల్లీలో ఉంటూ.

రాష్ట్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వేస్తూ వార్తల్లో ప్రముఖంగా నిలిచేవారు.తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రముఖ టీవీ ఛానల్స్ డిబేట్ లైవ్ లో పాల్గొనేవారు.

కాగా మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో సొంత నియోజకవర్గానికి ఎంపీ రఘురామకృష్ణ రావడానికి సిద్ధపడటం ఏపీ రాజకీయాల్లో( AP Politics ) సంచలనంగా మారింది.

లైగర్ లో అనన్య అసౌకర్యంగానే నటించింది.. హీరోయిన్ తండ్రి షాకింగ్ కామెంట్స్ వైరల్!