జగన్ ముందు చెక్క భజనలు ఆయన వెనుక గోతులు.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ?
TeluguStop.com
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా విశాఖ స్టీల్ ప్లాంట్ మారింది.అంతే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదని, 100% పెట్టుబడులు ఉపసంహరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం వెనక ఉన్న వ్యూహాన్ని కనిపెట్టలేని నేతలు పలు విమర్శలు చేస్తున్నారు.
ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం పై కూడా టీడీపీ నాయకులు విరుచుకు పడుతుండగా, వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు.
ఈ నేపధ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నోసార్లు ఆరోపణలు చేసిన రఘురామకృష్ణరాజు, జగన్ తరపున మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ జైలుకెళ్తే సీఎం పదవిని దక్కించుకోవడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
జగన్ ముందు చెక్క భజనలు చేస్తూ, ఆయన వెనుక గోతులు తీస్తున్నారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయని, కాబట్టి ఇలాంటి కపట వేషధారులను పట్టుకోవాలని సూచించారు.
ఈమేరకు జగన్ వెనుక ఏ వెధవలు కుట్ర చేస్తున్నారో అనే విషయంపై దృష్టి సారిస్తే మంచిదనే అభిప్రాయాన్ని తెలియచేశారు.
వైరల్ వీడియో: ఒంటి చేత్తో 90 లక్షల విలువైన క్యాచ్ ను పట్టుకున్న వీక్షకుడు