కుప్పం లో చంద్రబాబు గెలుపు ' లెక్క ' ఇదా ? గాలి తీసేసిన వైసీపీ !

కుప్పం నియోజకవర్గం పేరు చెబితే మొదట గుర్తుకు వచ్చేది టిడిపి అధినేత చంద్రబాబు.

వరుసగా ఆయన ఈ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు  అక్కడ టిడిపికి తిరిగే లేదన్నట్లుగా పరిస్థితి ఉండేది.

అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో పరిస్థితులు తారుమరయ్యాయి.ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసిపి నడిచింది దీంతోపాటు ఆ నియోజకవర్గంలో టిడిపిని బలహీనం చేసే విధంగా కీలక నాయకులు అందరిని వైసీపీలో చేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

ముఖ్యంగా వైసిపి కీలకనేత , ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై పూర్తిగా ఫోకస్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా ఆయన ముందుకు వెళ్తున్నారు.తాజాగా ఈ నియోజకవర్గ వ్యవహారాలపై జగన్ కు అత్యంత సన్నిహితుడు, వైసిపి నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న కుప్పం నియోజకవర్గంలోని భోగస్ ఓట్లతో చంద్రబాబు వరుసగా గెలుస్తూ వస్తున్నారని మిథున్ రెడ్డి సంచలన విమర్శలు చేశారు.

  """/"/ కుప్పం ప్రాంతవాసులకు తమిళనాడు , కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సంబంధాలతో బోగస్ ఓట్లు అధికంగా ఉన్నాయని,  ఈ నియోజకవర్గంలో రెండు లక్షల పైచిలుకు ఓట్లు ఉండగా,  ప్రభుత్వ సంక్షేమ పథకాలు , వివిధ రకాలుగా ఆధార్ కార్డు లింక్ అయిన వారు 1.

83 లక్షల మంది ఓటర్లు ఉన్నారని మిథున్ రెడ్డి తెలిపారు.నియోజకవర్గంలో 17% అనగా 36వేల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారిందని,  ఈ ఓటర్ల లో ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది తేల్చలేకపోతున్నామని మిధున్ రెడ్డి తెలిపారు.

"""/"/ రామకుప్పం మండలం విజలాపురంలో కుమార్ అనే వ్యక్తికి విజాలాపురంలో ఓటు హక్కు ఉందని,  ఇతను పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం వాణిం యంబాడి లో ఓటు వినియోగించుకున్నాడని మిధున్ రెడ్డి తెలిపారు.

అలాగే కౌగుంది గ్రామానికి చెందిన అమ్మనమ్మ కంగుందిలో పక్కనే ఉన్న విధాలాపురం పంచాయతీలోనూ ఓటు వినియోగించుకున్నట్లు మిథున్ రెడ్డి తెలిపారు.

ఈ విధంగా భోగస్ ఓట్లతో చంద్రబాబు ఏళ్ల తరబడిగా కుప్పంలో గెలుస్తూ వస్తున్నారని,  కుప్పం లోని భోగస్ ఓట్ల పై కేంద్ర , రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నట్లు మిథున్ రెడ్డి తెలిపారు.

 .

మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏకంగా ఆ పండుగను టార్గెట్ చేశారా?